Thomas Waders Guinness World Records : ఈ ప్రపంచంలో అత్యంత పొడవైన ముక్కు ఎవరికుందంటే?

కాదేది కవితకు అనర్హం అన్నమాదిరిగా, కాదేది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కి అనర్హం అని చెప్పుకోవచ్చు.ఎందుకంటే మీలో ఎలాంటి ప్రత్యేకత వున్నా, గిన్నిస్ గుర్తించి మిమ్మల్ని మెడల్ తో సత్కరిస్తుంది, సమాజంలో మీకు వున్నత స్థానాన్ని పదిలపరుస్తుంది.అవును, మీరు వినే వుంటారు.మనుషుల శరీరాలలో వింత భాగాలను కూడా గిన్నిస్ గుర్తిస్తుంది.తద్వారా ఇలాంటివారు వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేయగలుగుతారు.ఈ క్రమంలోనే అత్యంత పొడవైన మనిషి నుంచి అతి తక్కువ ఎత్తుకలిగిన పొట్టి మనిషి వరకు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ సృష్టిస్తుంటారు.

 Who Has The Longest Nose In The World, Largest Nose , Viral Latest, News Viral,-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే అత్యంత పొడవైన ముక్కు రికార్డు అనేది నమోదు అయ్యింది.అయితే ఈ విషయం చాలా తక్కువమందికి తెలుసు.అలాంటి వ్యక్తి కూడా ప్రపంచంలో ఒకరు వున్నారని మీకు తెలుసా? ప్రపంచంలోని అత్యంత పొడవైన ముక్కు కలిగిన ఆ వ్యక్తి ఇప్పుడు ప్రపంచ రికార్డులో తన పేరును లిఖించుకోగలిగాడు.అతడికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.

ఓ ఇంగ్లీష్ సర్కస్ ప్రదర్శకుడి ముక్కు ప్రపంచంలోనే అత్యంత పొడవైనదిగా వరల్డ్‌ రికార్డ్‌ గుర్తించింది.వాస్తవానికి ఈ రికార్డు గతంలో 18వ శతాబ్దంలో నివసించిన వ్యక్తికి చెందినది.

వివరాల్లోకి వెళితే, అతడి పేరు థామస్ వాడర్స్.ఇతనొక ఆంగ్ల సర్కస్ ప్రదర్శనకారుడు.ఇతనిని థామస్ వాడ్‌హౌస్ అని కూడా పిలుస్తారు.అతని ముక్కు దాదాపు 19 సెంటీమీటర్లు అంటే 7.5 అంగుళాలు పొడవు కలిగి ఉంటుంది.అయితే ఆయన మరణానంతరం తరువాత తన ముక్కుకి పేరు దక్కడం విశేషం.

హిస్టారిక్ విడోస్ అనే ట్విట్టర్ పేజీ నవంబర్ 12 న ఒక చిత్రంతో పాటు ఆ మనిషికి సంబంధించి అద్భుతమైన కథను పోస్ట్ చేయగా వెలుగు చూసింది.రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ మ్యూజియంలో అతని మైనపు బొమ్మను ఏర్పాటు చేశారు.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వెబ్‌సైట్ ప్రకారం 1770లలో ఇంగ్లండ్‌లో నివసించేవాడని తెలిసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube