అమెరికా చరిత్రలో తొలిసారిగా వైట్‌హౌస్ అధికారులు .బహిష్కరణ ప్రమాదంలో వున్న ‘డ్రీమర్స్’ ప్రతినిధి బృందాన్ని కలుసుకున్నారు.
వీరిలో ఎక్కువ మంది భారతీయ అమెరికన్లే.ఈ సందర్భంగా బాధితులు తమ ఆందోళనలను అధికారులకు తెలియజేశారు.
అమెరికాలో దాదాపు 2,50,000 మంది డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ వున్నారు.వీరు చట్టబద్ధంగా ఇక్కడే పెరిగారు.
కానీ 21 ఏళ్లు నిండిన తర్వాత వీరంతా దేశాన్ని విడిచిపెట్టాల్సి వుంది.‘ఇంప్రూవ్ ది డ్రీమ్’ అనే సంస్థ మాట్లాడుతూ.
పరిపాలనాపరమైన, శాసనపరమైన సానుకూల విధాన మార్పుల కోసం తాము ఎదురుచూస్తున్నామని పేర్కొంది.ఈ వారం ప్రారంభంలో ఇంప్రూవ్ ది డ్రీమ్ ప్రతినిధి బృందం .ఇమ్మిగ్రేషన్‌పై అధ్యక్షుడి డిప్యూటీ అసిస్టెంట్ బెట్సీ లారెన్స్, ఆసియన్ అమెరికన్ స్థానిక హవాయి పసిఫిక్ ద్వీపవాసులకు సంబంధించి ఇమ్మిగ్రేషన్‌పై డిప్యూటీ అసిస్టెంట్ ఎరికా ఎల్ మోరిట్సుగులతో భేటీ అయ్యింది.డ్రీమర్స్ గత కొన్నేళ్లుగా రాజధానికి వస్తున్నప్పటికీ.
సీనియర్ వైట్‌హౌస్ అధికారులు వారిని కలవడం ఇదే తొలిసారి.
ఈ సందర్భంగా శ్రీహరిణి కుందు అనే యువతి మీడియాతో మాట్లాడుతూ.తమ సమస్యలను వినడానికి, సహాయం చేయడానికి సిద్ధంగా వున్న వైట్‌హౌస్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.శ్వేత సౌధం అధికారులను కలిసిన తొలి గ్రూప్‌గా ఈ అనుభవాన్ని తాను మరిచిపోలేనని హరిణి వ్యాఖ్యానించారు.
హరిణి తన ఏడేళ్ల వయసులో అమెరికాకు వచ్చారు.అప్పటి నుంచి టెక్సాస్, న్యూజెర్సీ, నార్త్ కరోలినాలో నివసించారు.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో తనకు 23 ఏళ్లు వస్తాయని.తాను ప్రస్తుతం ఎఫ్ 1 విద్యార్ధి వీసా హోదాలో వున్నానని.తన విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత స్వయంగా అమెరికాను విడిచిపెట్టాల్సి వుంటుందని హరిణి చెప్పారు.తాను నార్త్ యూనివర్సిటీ నుంచి సైకాలజీలో గ్యాడ్యుయేషన్ చేయబోతున్నానని తెలిపారు.
మరో యువతి మాట్లాడుతూ.ప్రతి ఏడాది తనలాంటి వేలాది మంది ఎదుర్కొంటున్న కష్టాల పట్ల బైడెన్ యంత్రాంగం చాలా సానుభూతితో ఉన్నట్లు కనిపిస్తోందన్నారు.తమకు త్వరలో న్యాయం జరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
వివాదం నేపథ్యం ఇది:
అమెరికాలో హెచ్–1బీ, ఇతర దీర్ఘకాలిక నాన్–ఇమ్మిగ్రెంట్ వీసాదారుల పిల్లలను ‘డ్రీమర్’లుగా పిలుస్తారు.ఈ చట్టబద్ధ వలసదారుల పిల్లల వయసు 21 ఏళ్లు నిండితే వారు అమెరికాలో ఉండటానికి అనర్హులు.అప్పుడు వారు అగ్రరాజ్యాన్ని వదిలి స్వదేశాలకు వెళ్లాల్సి వుంటుంది.
ఇలాంటి వారు అమెరికాలో దాదాపు 2,50,000 మంది వరకు వుంటారని అంచనా.భారీసంఖ్యలో డ్రీమర్ల తల్లిదండ్రులు దశాబ్దాలుగా ‘గ్రీన్ కార్డు’ కోసం నిరీక్షిస్తున్నారు.
ఈ సమయంలో వారి పిల్లల వయసు 21 ఏళ్లు దాటుతోంది.దీంతో అలాంటి వారు అమెరికాను వీడిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.డ్రీమర్లు 21 ఏళ్ల వయసులోపు వరకూ డిపెండెంట్‌లుగా తమ తల్లిదండ్రులతోపాటే అమెరికాలోనే ఉండొచ్చు.21 ఏళ్లు దాటితే వారికి ఆ డిపెండెంట్ హోదా పోతుంది.వారిలో ఎక్కువ మంది తల్లిదండ్రులతో కలిసి చిన్నారులుగా అగ్రరాజ్యం వచ్చిన భారతీయులే ఉన్నారు.
ఇలాంటి వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో గతేడాది సెనేటర్లు అలెక్స్ పడిల్లా (డెమొక్రటిక్ పార్టీ), రాండ్ పాల్(రిపబ్లికన్).‘అమెరికా చిల్డ్రన్ యాక్ట్’ పేరిట సెనేట్‌లో కీలక బిల్లును ప్రవేశపెట్టారు.దీనికి ఆమోదం లభిస్తే.
ఈ డాక్యుమెంటెడ్ డ్రీమర్లకు అమెరికన్ పౌరసత్వం లభిస్తుంది.