వెరైటీగా బ్యాటింగ్ చేసి చరిత్రకెక్కిన వార్నర్

తెలుగు క్రికెట్ ప్రేక్షకులకు వార్నర్( Warner ) అంటే ప్రత్యేక అభిమానం ఉంటుంది.ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా, ఆటగాడిగా సుదీర్ఘ కాలం అలరించాడు.

 Warner Who Made History By Batting As A Variety ,warner, Latest News, New Record-TeluguStop.com

ఇక మ్యాచ్‌లు ఆడేటప్పుడు, మైదానం వెలుపల తెలుగు పాటలకు డ్యాన్స్ చేస్తుంటాడు.ఫ్యామిలీతో కలిసి కూడా పాపులర్ తెలుగు పాటలకు, డైలాగ్‌లను చెబుతూ వీడియోలు చేస్తుంటాడు.

దీంతో మన దేశం కాకపోయినా, మన భాష రాకపోయినా తెలుగు సినిమాల పట్ల, తెలుగు వారి పట్ల అతడు చూపించే అభిమానానికి అంతా ఫిదా అయ్యారు.ఇక మైదానంలోనూ ఆటగాడిగా ఎన్నో రికార్డులను సృష్టించాడు.ప్రస్తుతం 5668 పరుగులతో అత్యధిక రన్స్ చేసిన బ్యాట్స్‌మెన్( Batsmen ) జాబితాలో నాలుగో ర్యాంకులో ఉన్నాడు.ఇలాంటి వార్నర్ క్రికెట్ మైదానంలో మరో చరిత్ర సృష్టించాడు.

దానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్( Delhi Capitals, Mumbai Indians ) మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఎడమ చేతి వాటం ఓపెనర్ అయిన వార్నర్ కుడిచేతి వాటంతో బ్యాటింగ్ చేశాడు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.మ్యాచ్ 8వ ఓవర్ సమయంలో, ముంబై ఇండియన్స్ స్పిన్నర్ హృతిక్ షోకీన్( Hrithik Shokin ) 3వ బంతిని ఓవర్ స్టెప్ చేయడంతో ఢిల్లీకి ఫ్రీ హిట్ లభించింది.

ఫ్రీ-హిట్ డెలివరీని ఎదుర్కొనేందుకు వార్నర్ తన బ్యాటింగ్ స్టైల్ మార్చేశాడు.రైట్ హ్యాండ్ బ్యాటర్‌గా మారడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు.

అయితే, షార్ట్-పిచ్ బాల్ ఉన్నప్పటికీ, వార్నర్ ఆ డెలివరీలో ఒక్క సింగిల్ మాత్రమే తీయగలిగాడు.వార్నర్ ఎప్పటిలాగే ఆడి ఉంటే ఖచ్చితంగా ఆ బాల్ సిక్సర్ అయ్యేదని అభిమానులు భావిస్తున్నారు.క్రికెట్ మరియు ఐపిఎల్‌లో బంతి తర్వాత రివర్స్ స్వీప్, స్విచ్డ్ స్టాన్స్ సర్వసాధారణం.అయితే వార్నర్ బంతికి ముందు ఏకంగా తన బ్యాటింగ్ స్టైల్ ఎడమ నుంచి కుడికి మార్చడంతో అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

మామూలుగా అయితే దీనిని ఎవరూ ఆమోదించరు.అయితే ఫ్రీ హిట్ విషయంలో ఎలా ఆడినా ఎవరూ పట్టించుకోరు కాబట్టి వార్నర్ ఇలా ఆడాడు.క్రికెట్ చరిత్రలో తన పేరును ఇలా విభిన్నంగా లిఖించుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube