2022 టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఏదనే ప్రశ్నకు ఆర్ఆర్ఆర్ మూవీ పేరు సమాధానంగా వినిపిస్తోంది.అయితే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది.
ఆ రికార్డులలో కొన్ని రికార్డులు ఇప్పట్లో బ్రేక్ కావడం కష్టమని కామెంట్లు వినిపించాయి.టికెట్ రేట్లు భారీ స్థాయిలో పెంచడం వల్ల కూడా ఆర్ఆర్ఆర్ మూవీ రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించడం సాధ్యమైంది.
అయితే ఆర్ఆర్ఆర్ మూవీ సాధించిన కలెక్షన్లను వాల్తేరు వీరయ్య మూవీ బ్రేక్ చేసింది.తాడిపత్రి ప్రాంతంలో వాల్తేరు వీరయ్య మూవీ ఈ అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకుంది.
వాల్తేరు వీరయ్య మూవీ ఫుల్ రన్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచే అవకాశం ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.చరణ్, తారక్ మూవీ క్రియేట్ చేసిన రికార్డును చిరంజీవి మూవీ బ్రేక్ చేయడం ఫ్యాన్స్ ఆనందానికి కారణమవుతోంది.
వాల్తేరు వీరయ్య మూవీ సక్సెస్ శృతి హాసన్, బాబీ కెరీర్ కు కూడా ప్లస్ అయింది.68 సంవత్సరాల వయస్సులో కూడా చిరంజీవి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని అందుకు ఈ కలెక్షన్లు సాక్ష్యమని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.వాల్తేరు వీరయ్య థర్డ్ డే కలెక్షన్లతోనే ఈ రికార్డును సొంతం చేసుకుందని సమాచారం అందుతోంది.ఈ సినిమాతో చిరంజీవి క్రేజ్ అంతకంతకూ పెరుగుతోందని బోగట్టా.
రీఎంట్రీలో చిరంజీవి నటించి హైయెస్ట్ కలెక్షన్లను సాధించిన సినిమాగా ఈ సినిమా నిలుస్తోంది.చిరంజీవి భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు కూడా ఈ సినిమా వల్ల రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.వాల్తేరు వీరయ్య మూవీ అంచనాలను మించి హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే.చిరంజీవి భవిష్యత్తు ప్రాజెక్ట్ లు సైతం రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.