తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్( Vladimir Putin ) భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. ‘మేక్ ఇన్ ఇండియా’ వంటి మోదీ విధానాలు ఇటీవలి కాలంలో భారత్‌ను ఎంతో విజయవంతం చేశాయన్నారు.
కాలినిన్‌గ్రాడ్‌లోని ఓ యూనివర్సిటీలో కొంతమంది విద్యార్థులతో మాట్లాడిన సందర్భంగా పుతిన్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.రష్యన్ విద్యార్థులకు( Russian students ) ప్రత్యేకమైన రోజున మోదీ( modi ) గురించి చెబుతూ వారిని మోటివేట్ చేసే ప్రయత్నం చేశారు.

భారత ఆర్థిక వ్యవస్థపై పుతిన్ ప్రశంసలు కురిపిస్తూ, ఇండియన్ ఎకానమీ వేగంగా వృద్ధి చెందడానికి మోదీయే కారణమని అన్నారు.రష్యాకు భారత్ నమ్మకమైన మిత్రుడని, ప్రపంచంలో రష్యా ప్రయోజనాలను దెబ్బతీసేలా తాము ఏమీ చేయబోమని ఆయన అన్నారు.భారత్‌లో రష్యా భారీగా పెట్టుబడులు పెడుతున్నదని పుతిన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.భారతదేశంలో చమురు శుద్ధి కర్మాగారం, కొన్ని గ్యాస్ స్టేషన్లు, ఓడరేవును నిర్మించడంలో భాగంగా రష్యా చమురు కంపెనీ రోస్‌నెఫ్ట్ ( Rosneft )పెద్ద ఒప్పందాన్ని కుదుర్చుకుందని తెలిపారు.
భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులు ఇరుదేశాల మధ్య ప్రారంభమవుతాయని కూడా పేర్కొన్నారు.

ఈ నెల ప్రారంభంలో మోదీ, పుతిన్‌ల మధ్య ఫోన్ సంభాషణలు జరిగాయి.రెండు దేశాలను, ప్రపంచాన్ని ప్రభావితం చేసే అనేక సమస్యల గురించి వారు మాట్లాడారు.వారు కొన్ని కొత్త ప్రణాళికలపై కలిసి పనిచేయడానికి కూడా అంగీకరించారు.
దీనిపై మోదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.బ్రిక్స్ దేశాల గ్రూపులో రష్యా పాత్రపై చర్చించామని చెప్పారు.
రష్యా ప్రభుత్వం అయిన క్రెమ్లిన్ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది.మోదీ పుతిన్ తమ బంధాన్ని మరింత పటిష్టం చేయాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది.
ఉక్రెయిన్‌లో పరిస్థితిపై కూడా వారు మాట్లాడారు.గత నెలలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ రష్యా వెళ్లారు.
పుతిన్‌తో సమావేశమై చర్చలు జరిపారు.వారు మాస్కోలో మూడు ఒప్పందాలపై సంతకం చేశారు.
ఇవి అణు విద్యుత్ ప్లాంట్లు, ఔషధం, దౌత్య చర్చలకు సంబంధించినవి.