వీడియో: ఐదవ అంతస్తు నుంచి జారిపడ్డ బాలిక.. హీరోలా క్యాచ్ పట్టాడు..!

ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఒక షాకింగ్ వీడియో నెటిజన్ల హార్ట్ బీట్ పెంచేస్తోంది.ఈ వీడియోలో ఒక రెండేళ్ల పాప ఐదవ అంతస్తు ఫ్లాట్ నుంచి పడిపోయింది.

 Viral Video Man Saved Child Life Who Fell Down From Fifth Floor Details, Viral L-TeluguStop.com

అయితే ఈ బాలిక నేలను తాకకుండా సురక్షితంగా క్యాచ్ పట్టాడో బాటసారుడు.ఈ రెండేళ్ల పాపను క్యాచ్ పట్టుకున్న ఆ హీరో వీడియోని చూసి అందరూ తెగ ప్రశంసిస్తున్నారు.

చైనా ప్రభుత్వ అధికారి లిజియాన్ జావో ట్విట్టర్ లో ఈ వీడియోను షేర్ చేస్తూ “మన మధ్య ఉన్న హీరోలు” అనే క్యాప్షన్‌తో జతచేశారు.

వివరాల్లోకి వెళితే.

చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లోని టోంగ్‌క్సియాంగ్‌లో 5వ అంతస్తుకి వేలాడుతూ ఒక చిన్నారి కనిపించింది.అయితే దీనిని మొదటగా ఎవరూ గుర్తించలేదు.

ఈ క్రమంలోనే షెన్ డాంగ్ అనే వ్యక్తి అదే ప్రాంతంలో తన కారును పార్క్ చేస్తున్నప్పుడు పెద్ద చప్పుడు వినిపించింది.దాంతో అతను చుట్టుపక్కలంతా చూసేసరికి భవనంపై నుంచి రెండేళ్ల చిన్నారి పడిపోవడాన్ని గుర్తించాడు.

అలా చూస్తుండగానే ఆ బాలిక మొదటి అంతస్తు పైఅంచుకు దొర్లింది.ఈ దృశ్యాన్ని చూసి షాక్ అయిన ఆ వ్యక్తి తక్షణమే భవనం వైపు పరిగెత్తాడు.

కాంక్రీట్‌ నెలపై పడే ముందు అద్భుతంగా చిన్నారిని పట్టుకున్నాడు.షెన్ డాంగ్ సకాలంలో స్పందించడం వల్ల పేవ్‌మెంట్‌ను తాకకుండా ఆ పాప బతికిపోయింది.బాలిక కాళ్లు, ఊపిరితిత్తులకు గాయాలైనట్లు తెలుస్తోంది.ఆమె ఆరోగ్యం ఇప్పుడు నిలకడగా ఉంది.ఇదే వీడియోలో షెన్ డాంగ్‌తో పాటు ఒక మహిళ కూడా ఆ చిన్నారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపించింది.దాంతో “లెజెండరీ క్యాచ్! ఆ ఇద్దరికి మెడల్ ఇవ్వండి.” అని ఒకరు కామెంట్ పెట్టగా.“ఒక మనిషి జీవితాన్ని రక్షించడం అంటే మొత్తం మానవాళిని రక్షించడం” అని ఇంకా ఒకరు కామెంట్ పెట్టారు.

ఈ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube