వైరల్ వీడియో: తెగ ఎంజాయ్ చేస్తున్న టీమిండియా సీనియర్ ఆటగాళ్లు..!

దూరంగా ఉన్న స్నేహితులు ఒక దగ్గర కలిస్తే ఎలా ఉంటుంది.ఇంకా వారి అల్లరికి మాటలే ఉండవు కదూ.

 Viral Video Indian Senior Cricketers Enjoying In Raipur Road Safety T20 Series-TeluguStop.com

సామాన్యులైన సెలబ్రెటీలైన.ఎవరైన.

తమ స్నేహితులను కలుసుకుంటే చిన్న పిల్లల మారిపోతారు.అరుస్తూ.

గంతులెస్తూ.అల్లరి చేస్తుంటారు.

తాజాగా ఇలాంటి అల్లరి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.అదేంటి అంత స్పెషాలెంటీ అనుకుంటున్నారా.? అవునండి.స్పెషలే మరీ.ఎందుకంటే ఆ వీడియో చిన్న పిల్లల అల్లరి చేస్తున్నది మన మాజీ క్రికెటర్స్.ఇటీవల రోడ్ సేఫ్టీ టీ20 ప్రారంభమైన సంగతి తెలిసిందే.ప్రస్తుతం రాయ్ పూర్ లో టీ20 సిరీస్ జరుగుతుంది.దీంతో అక్కడకు వెళ్ళిన ఇండియా జట్టు ఉల్లాసంగా గడుపుతుంది.ఈ సందర్భంగా భారత మాజీ క్రికెటర్ల మధ్య ఓ ఫైట్‌ జరిగింది.సరదాగా సాగిన ఈ ఫైట్‌కు సంబంధించిన ఓ వీడియోను టీమిండియా మాజీ క్రికెటర్‌ రోహన్ గవాస్కర్ మంగళవారం ట్విటర్‌ లో పోస్ట్ చేశాడు.

ఈ వీడియోలో భారత మాజీ స్పిన్నర్ ప్రఝాన్ ఓజాను ఇండియా లెజెండ్స్ జట్టు సభ్యులు పట్టుకోగా. యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, యుసుఫ్‌ పఠాన్‌లు ఓజా ముఖంపై కేక్‌ పూశారు.

యుసుఫ్‌ అయితే ఓజా ముఖం, జుట్టును కేక్‌ రుద్దాడు.ఆ వెంటనే ఓజా కేక్ పూసేందుకు ప్రయత్నించగా.

ఇర్ఫాన్ తప్పించుకోని పారిపోయాడు.ఇక అక్కడే ఉన్న యువరాజ్ సింగ్ ను.మహ్మద్ కైఫ్ పట్టుకోగా.ఓజా తన చేతిలో ఉన్న కేకు మొత్తాని యూవరాజ్ ముఖానికి పూసేసాడు.

మహ్మాద్ కైఫ్ గట్టిగా పట్టుకోవడంతో.యూవరాజ్ చేసేదేమి లేక కట్టుబాడి కేక్ అంటించుకోవాల్సి వచ్చింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పంధిస్తున్నారు.

ఇదిలా ఉంటే.శనివారం టీ20 సిరీస్ లో దక్షిణాఫ్రికాను 56 పరుగుల తేడాతో ఓడించి సెమీ పైనల్ కు వెళ్లింది టీమిండియా.

ఈరోజు వెస్టిండిస్ తో తలపడనుంది.ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్న ఆ వీడియోను మీరు ఓసారి చూసేయ్యండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube