మనం మామూలుగా ఆండ్రాయిడ్ ఫోన్ కొత్తగా తీసుకున్న రోజుల్లో బాగానే పని చేస్తుంది.ఒక మూడు, నాలుగు నెలలు గడిచిన తర్వాత ఫోన్ హ్యాంగ్ అవ్వడం ప్రతి ఒక్కరు గమనిస్తూనే ఉంటాం.
అయితే ఆపిల్ ఫోన్ లో ఇటువంటి హ్యాంగింగ్ అంటూ కనపడదు.ఇకపోతే ప్రస్తుత రోజుల్లో అనేక మంది టెక్నికల్ గాడ్జెట్స్ పై ఎందరో విశ్లేషణలు, రివ్యూలు రాయడం కామన్ గా మారిపోయింది.
అయితే అందరికీ తెలిసిన విధంగానే ఆండ్రాయిడ్ ఫోన్ల కంటే ఆపిల్ సంస్థ ఐ ఫోన్ లు ధర ఎక్కువగా ఉన్నా అవి బాగా పనిచేస్తాయి అని నమ్మకం అందరికీ ఉంది.ఇకపోతే తాజాగా ఓ వ్యక్తి ఈ అభిప్రాయం కరెక్ట్ కాదని ఐ ఫోన్ సాఫ్ట్వేర్ ఆండ్రాయిడ్ ఫోన్ తో పోలిస్తే సరిగా స్పందించలేదని ఓ నెటిజన్ ట్విట్టర్ వేదికగా ఓ వీడియోని పోస్ట్ చేసింది.
ఇక ఆ వీడియోలో ఆండ్రాయిడ్ ఫోన్ అలాగే ఐ ఫోన్ పక్క పక్కనే పెట్టి రెండిటిలోనూ సేమ్ యాప్స్ ఓపెన్ చేస్తుంటే ఆండ్రాయిడ్ మొబైల్ లో త్వరగా ఓపెన్ అవుతున్నాయి.అంతేకాదు ఏవైనా వెబ్సైట్లు, కెమెరా ఇలా వివిధ వాటిని ఓపెన్ చేస్తున్న కానీ ఆండ్రాయిడ్ మొబైల్ లోనే త్వరగా ఓపెన్ అవుతున్నాయి.
ఇకపోతే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో కొత్త దుమారానికి దారి తీసింది.ఆ వీడియో వల్ల ఇప్పుడు ఆపిల్ యూజర్లు అలాగే ఆండ్రాయిడ్ యూజర్ల మధ్య వర్చ్యువల్ వార్ జరుగుతుంది కాబోలు.ఇందులో ఎవరికి వారు తాము వాడుతున్న ఫోన్స్ వేగంగా పనిచేస్తున్నాయని పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నారు.
అయితే ఈ వీడియో ని పోస్ట్ చేసిన ఎలీ అనే అమ్మాయి అభిప్రాయం ప్రకారం ఆండ్రాయిడ్ లో ఎన్ని కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్స్ వచ్చిన ఆపిల్ ఫోన్ లో మాత్రం ఒకటే సాఫ్ట్వేర్ వచ్చిందని అభిప్రాయపడుతోంది.అయితే ఆపిల్ సాఫ్ట్వేర్ లో వైరస్ ప్రవేశించే ఛాన్సే లేదని అదే ఆండ్రాయిడ్ ఫోన్ అయితే కచ్చితంగా మూడు నెలలకు ఒకసారి అయినా సరే మొత్తం క్యాచీ ఫైల్స్ తీసేయాలని ఎవరికి తోచింది వారు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
మొత్తానికి ఆండ్రాయిడ్ ఫోన్ లను తప్పుపడుతూ ఐఫోన్ యూజర్లు, అలాగే వాటిని ఖండిస్తూ ఆండ్రాయిడ్ యూజర్లు సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేస్తున్నారు.