కర్ణాటక ఎన్నికల హడావుడి అయిపోయింది… కానీ అక్కడి వ్యూహాలు, సమీకరణాలు అన్ని ఇప్పుడు ఏపీ రాజకీయాలను కూడా ప్రభావితం చేసే స్థాయికి అక్కడి వ్యవహారాలు చోటుచేసుకున్నాయి.ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.
ఏపీలో ప్రధాన సామజిక వర్గం అయిన కాపుల్లో ఇప్పుడు రాజకీయ వెనుకబాటుతనం అనే ఫీలింగ్ మొదలయ్యింది.
కర్నాటక ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత కాపుల్లో రాజకీయ చైతన్యం పెరిగినట్టు కనిపిస్తోంది.
ఇక నుంచి కాపులకు ఒక ప్రత్యేక పార్టీ ఉంటుందని.మా కులం ఓట్లతో గెలిచే పార్టీకి.
మా కాపునేతే అధ్యక్షుడిగా ఉంటాడని బెజవాడ కాపు తీర్మానం చేసుకున్నట్టు తెలుస్తోంది.

కాపు సామాజిక వర్గంలో.ఇటీవల కుల, వర్గ, మత పరంగా జరుగుతున్న రాజకీయ విద్వేషాలు, తెర వెనుక కుట్రలు, తెరపై ఆ సామాజిక వర్గానికి అనుకూలంగా జరుగుతున్న మాటలు, మంత్రాలు ఇప్పుడు కాపు గుండెలను రగిలిస్తున్నాయి.ఎప్పుడూ ఏదో ఒక పార్టీకి ఓట్లు వేసి.
ఆ తర్వాత వారి దయాదాక్షిణ్యాలపై ఉండాల్సి వస్తోందని కాపుల్లో ఒక రకమైన ఫీలింగ్ వచ్చేసింది.దానికి బెజవాడ తీర్మానమే ఒక ఉదాహరణగా కనిపిస్తోంది.
కర్నాటకలో వొక్కలిగ సామాజికవర్గం పార్టీ జేడీఎస్.కుమారస్వామి పార్టీ.జనతాదళ్ సెక్యూలర్.ఈ పార్టీ వొక్కలిగ సామాజికవర్గంది.వీరి ఓట్ల శాతం కేవలం 8.16శాతం మాత్రమే.జనాభా 49 లక్షల మంది మాత్రమే.పార్టీ పుట్టిన 30 ఏళ్ల నుంచి కింగ్ మేకర్ పాత్ర.ఓసారి స్వతంత్రంగా అధికారంలోకి వచ్చారు.ఆ తర్వాత కింగ్ మేకర్ పాత్ర వీళ్లదే.
భూస్వాములు, మైసూర్, మాండ్యా ప్రాంతాల్లో వ్యవసాయం చేసే వారంతా వొక్కలిగ సామాజికవర్గం వారే.ఆర్థికంగా బలంగా ఉంటారు.
ఓట్ల శాతం తక్కువే అయినా.ఈ ఓట్లన్నీ గంపగుత్తెగా జేడీఎస్ కు పడతాయి.
వొక్కలిగ సామాజిక వర్గానికి ఓ పార్టీ ఉందని.మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో ప్రతి ఎన్నికల్లో సత్తా చాటుతూ ఉంటారు.
ఇప్పటి వరకు ఏపీలో కాపులకు ప్రత్యేకంగా పార్టీ అంటూ లేకపోవటం కరెక్ట్ కాదని కాపు నాయకులు అభిప్రాయపడుతున్నారు.కర్నాటకలో కేవలం 8శాతం ఉన్న వొక్కలిగలు అధికారంలోకి వస్తుంటే.16శాతం ఉన్న కాపులు ఎందుకు ఇలా రాజకీయ వెనకబాటులో ఉన్నారో ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని కాపుల్లోని మేధావులు ఈ తీర్మానం సందర్భంగా తమ మనోవేదన వ్యక్తం చేశారు.70ఏళ్లలో కాంగ్రెస్, టీడీపీలకి కొమ్ముకాశారు.ఏపీలో 16శాతం ఉన్న కాపులు.కేవలం 4.7శాతం ఉన్న కమ్మ సామాజికవర్గానికే కాపు కాస్తున్నాం అనే భావన మొదలైంది.ఏమైనా ఈ బెజవాడ కాపు తీర్మానం రాజకీయంగా పెను సంచలనం సృష్టించే అవకాశం అయితే లేకపోలేదు.