ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన 5 ఏళ్లలోనే స్టార్ హీరో రేంజ్ ఇమేజి ని సొంతం చేసుకున్న హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda ).‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ అనే సినిమా లో చిన్న పాత్ర ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైన ఈ హీరో అంటే నేడు యూత్ ఆడియన్స్ మెంటలెక్కిపోతున్నారు.ముఖ్యంగా అమ్మాయిల్లో ఒకప్పుడు మహేష్ బాబు ఎలాంటి క్రేజ్ ఉండేదో, విజయ్ దేవరకొండ కి అలాంటి క్రేజ్ ఉంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఇతనికి యూత్ లో ఈ రేంజ్ క్రేజ్ రావడానికి ప్రధాన కారణం అర్జున్ రెడ్డి చిత్రం.
అంతకు ముందు పెళ్లి చూపులు సినిమాతో హీరో గా మొదటి హిట్ ని అందుకున్న విజయ్ కి, ‘అర్జున్ రెడ్డి’( Arjun Reddy’ ) చిత్రం కల్ట్ ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసింది.ఈ సినిమా ద్వారానే సందీప్ వంగ ఇండస్ట్రీ కి డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు.

ఈ చిత్రం తో సందీప్ వంగ కి మరియు విజయ్ దేవరకొండ కి మధ్య ఎంతో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది.సందీప్ ని తన సొంత సోదరుడి లాగ భావిస్తాడు.ఇండస్ట్రీ లో ఏ హీరో కూడా అర్జున్ రెడ్డి చిత్రాన్ని చెయ్యడానికి సాహసం చెయ్యలేదు.కానీ విజయ్ దేవరకొండ తనని నమ్మి చేసినందుకు సందీప్ కి కూడా విజయ్ అంటే ఎంతో అభిమానం ఏర్పడింది.
తన అభిమానం కి గుర్తుగా ఎదో ఒకటి చెయ్యాలని ‘ఎనిమల్( Animal )’ చిత్రానికి ఒక నిర్మాతగా వ్యవహరించమని విజయ్ దేవరకొండ ని కోరాడు సందీప్.విజయ్ దేవరకొండ హీరో గా చేస్తున్నప్పటికీ కూడా నిర్మాతగా కొన్ని సినిమాలను తీసాడు.
అలా ఈ సినిమాకి కూడా చెయ్యమని అడిగాడు.టీ సిరీస్ తో పాటు మరో ఇద్దరు నిర్మాతలుగా వ్యవహరించే ఛాన్స్ ఉందని, నేను మా అన్నయ్య ఒక నిర్మాతగా ఉందాం అని అనుకున్నాం కానీ, మా బదులు నువ్వు ఉంటే బాగుండును అనిపించింది అని విజయ్ దేవరకొండ ని అడిగాడట.

కానీ విజయ్ దేవరకొండ మాత్రం ఈ ఆఫర్ ని చాలా సున్నితంగా రిజెక్ట్ చేసాడట.ప్రస్తుతం ఉన్న పరిస్థితి లో తాను అంత బడ్జెట్ పెట్టే స్థాయిలో లేనని, అంత రిస్క్ అసలు చెయ్యలేను అని చెప్పాడట.దీంతో ఎనిమల్ చిత్రానికి ఒక నిర్మాతగా వ్యవహరించే అదృష్టం ని కోల్పోయాడు.ఇప్పుడు ఆ చిత్రం ఈ వీకెండ్ లో వెయ్యి కోట్ల రూపాయిల మార్కుని అందుకోబోతుంది.
ఇందులో నిర్మాతగా వ్యవహరించి ఉంటే విజయ్ దేవరకొండ కి బోలెడంత లాభాలు వచ్చేవి.కానీ బ్యాడ్ లక్ పాపం.భవిష్యత్తులో ఇలాంటి ఆఫర్స్ వస్తే ఇలాగే వదులుకుంటాడా? , లేదా ఎనిమల్ నుండి గుణపాఠం ఏమైనా నేర్చుకున్నాడా అనేది చూడాలి.