వైరల్: నీళ్లలో మునిగిపోతున్న కాకిని చూసి ఎలుగుబంటి ఏం చేసిందో తెలుసా?

Video Of Bear Saving Drowning Crow At The Budapest Zoo Goes Viral Details, Viral, Viral Latest, News Viral, Social Media, What The Bear , Saw The Crow Drowning, In The Water, Bear Saving Drowning Crow , Budapest Zoo , Bear Crow, Hungary, Bear Save Crow

ప్రేమ, దయ అనే గుణాలు మనుషులకే కాదు, అప్పుడపుడు జంతువుల్లో కూడా అవి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.సందర్భాన్ని బట్టి క్రూర జంతువులు కూడా ఒక్కోసారి ఇతర జీవులపట్ల కరుణ చూపిస్తుంటాయి.

 Video Of Bear Saving Drowning Crow At The Budapest Zoo Goes Viral Details, Viral-TeluguStop.com

సోషల్ మీడియా( Social Media ) ఎక్కువగా ప్రబలడంతో అలాంటి వీడియోలు వెలికి వస్తున్నాయి.ఇలా అలాంటి వీడియోలు చూస్తున్నపుడు ఒక్కోసారి మనుషుల కంటే జంతువులే నయం అనిపిస్తుంది.

ఎందుకంటే నేటి మనిషి మానవత్వం మర్చిపోయి బతుకుతున్నాడు కనుక.

అసలు విషయంలోకి వెళితే, అడవిలోని క్రూర మృగాలు ఎప్పుడూ ఇతర జంతువులను వెటాడే పని మాత్రమే పెట్టుకుంటాయి అని అందరూ అనుకుంటారు.కానీ, వేటాడే మృగాలు సైతం ఆపదలో ఉన్న మరో జీవి ప్రాణాలను కాపాడాతాయని కలలో కూడా ఎవ్వరూ ఊహించరు.తాజాగా దానిని నిరూపిస్తూ ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

నీటిలో పడి ప్రాణాలు కోల్పోతున్న ఓ కాకిని ( Crow ) ఎలుగుబంటి కాపాడిన వీడియో ఇపుడు నెటిజన్లను మిక్కిలి ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

హంగేరిలోని( Hungary ) బుదాపేస్ట్ జూలో జరిగింది ఈ సంఘటనని చూసి చాలామంది తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉందంటే, ఓ కొలనులో కాకి ఒకటి ప్రమాదవశాత్తు పడిపోయింది.అందులో ఈదలేక అది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ కనిపించింది.

సరిగ్గా అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న ఓ ఎలుగుబంటి( Bear ) నీటిలో పడిపోయిన కాకి అరుపులు గమనించి ఆ కాకి వద్దకు వెళ్లింది.ప్రమాదాన్ని గుర్తించి నీటిలో మునిగిపోతున్న కాకిని ఎలుగుబంటి చటుక్కున పట్టుకుని ఒడ్డున పడేసి రక్షించింది.కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పటికే 5.5 మిలియన్ల వ్యూస్ రాబట్టింది.ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న కాకిని కాపాడిన ఎలుగుబంటికి నెటిజన్లు ఫిదా అయిపోయారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube