టికెట్ల కేటాయింపుల్లో రేవంత్ నయా ప్లాన్!

వచ్చే ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్( Congress ) ను అధికారంలోకి తీసుకురావాలని శత విధాలా ప్రయత్నిస్తున్న రేవంత్ రెడ్డి టికెట్ల కేటాయింపులో నయా ప్లాన్ ను అనుసరించబోతున్నారని విశ్లేషణలు వస్తున్నాయి.కాంగ్రెస్లో హై కమాండ్కు మాత్రమే సీట్లను కేటాయించే ఆచారం అనాదిగా వస్తూ ఉంది .

 Revanth  New  Plan In Tickets Issue, Revanth Reddy , Telangana Congress , Cm Kcr-TeluguStop.com

అయితే రేవంత్ రెడ్డి తో సఖ్యత లేని సీనియర్ నేతలు కేంద్రంతో పైరవీలు చేయించుకొని సీట్లను పొందాలని, రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ప్రమేయం లేకుండానే తాము టిక్కెట్లు పొంద గలమని నిరూపించుకోవాలని ఆలోచనలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది.అయితే వీటన్నిటికి చెక్ పెట్టాలని భావిస్తున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు నయా ప్లాన్ ను అమలు చేస్తున్నారట

Telugu Cm Kcr, Congress, Rahul Gandhi, Revanth Reddy, Ts-Telugu Political News

వచ్చే ఎన్నికలలో గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లు ఉంటాయని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ఆయన ఇందులో అధిష్టానం ప్రమేయం ఉండదని గెలిచే అభ్యర్థులపై సమగ్ర సర్వే నిర్వహించిన తర్వాత మాత్రమే టికెట్లు కేటాయిస్తామని సంచలన ప్రకటన చేశారు .ఆయా నియోజకవర్గాలలో అభ్యర్థుల మంచి చెడులపై ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత మాత్రమే టికెట్లు కేటాయింపు ఫైనల్ అవుతుందని ఆయన చెప్పడం ద్వారా కేంద్రం అండతో టికెట్లు దక్కించు కోవాలని చూస్తున్న సీనియర్ల ఆశలపై నీళ్లు చల్లేశారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి .

Telugu Cm Kcr, Congress, Rahul Gandhi, Revanth Reddy, Ts-Telugu Political News

గాంధీ కుటుంబంతో తనకున్న సాన్నిహిత్యంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ తను అనుకున్న వారికే టికెట్లు కేటాయించుకోవాలని బలంగా భావిస్తున్న ఆయన మొహమాటలను పక్కనపెట్టి విజయం సాధించే వారికి మాత్రమే టికెట్లు ఇవ్వాలని అప్పుడు మాత్రమే బలంగా ఉన్న బారాసా( BRS party )ను గద్దె దించడం కుదురుతుందని కాంగ్రెస్ నాయకత్వాన్ని ఒప్పించినట్లు సమాచారం.రేవంత్ పనితీరుపై ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చిన కాంగ్రెస్ అధిష్టానం ఆయన చెప్పిన విధానానికి ఆమోదం తెలిపిందట .దీన్ని బట్టి చూస్తే వచ్చే ఎన్నికలలో సీట్ల కేటాయింపులో తనదైన మార్క్ రేవంత్ రెడ్డి చూపించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube