వీడియో: సడన్‌గా ఎదురుపడ్డ ఆవు, చిరుత పులి.. తర్వాత జరిగిందేంటో మీరు ఊహించలేరు!

అడవిలో నివసించే క్రూరమృగాలు జంతువులను వేటాడి వాటి ఆహారంగా మార్చుకుంటాయి.బలహీనమైన జంతువులు ఆ క్రూర మృగాలకు తొందరగా ఆహారం అవుతాయి.

 Video A Cow And A Cheetah Suddenly Meet A Tiger You Can't Imagine What Happened-TeluguStop.com

అలా ఒక జీవి ప్రాణం ఇంకో జీవికి ఆహారంగా మారి దాని కడుపు నింపుతుంది.అయితే ఈ ఆహార వేటకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలానే చూస్తూ ఉంటాం.

కానీ ఇప్పుడు మనం చూడబోయే వీడియోలో మాత్రం ఒక్క క్రూరమృగం అందరి అంచనాలను తారుమారు చేసింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.

అయితే ఈ వీడియోలో క్రూర మృగం అయిన ఒక చిరుతపులి తన స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించింది.రాత్రి సమయంలో అడవి నుండి బయటకి వచ్చిన చిరుత పులి రోడ్డుపక్కనే గడ్డి మేస్తున్న ఒక ఆవును చూసింది.

కానీ దాన్ని ఏమాత్రం హింసించడానికి ప్రయత్నించలేదు.గడ్డి మేస్తున్న ఆవును చూసి దానిపై ఎటువంటి దాడి చేయకుండా ఆవు పక్కనుండి నడుచుకుంటూ మళ్ళీ అడవిలోకి వెళ్లిపోయింది.

నిజానికి ఈ వీడియో క్లిప్ చూసే వారు పులి ఆవుని చంపి దాని కడుపు నింపుకుంటుందని అనుకుంటారు.కానీ పులి వ్యవహరించిన తీరు చూసి అందరూ ఆశ్చర్య పోతున్నారు.ఈ సంఘటన జరిగిన సమయంలో అటు వైపుగా వెళ్తున్న కొంతమంది ఈ ఘటనను వారి కెమెరాలో బందించారు.నిజానికి స్వయంగా ఈ ఘటన చూసిన వారు కూడా చిరుత పులి ఆవుపై దాడి చేస్తుంది అని భావించారు.

అందుకే తమ ప్రయత్నంగా ఆ చిరుతను భయపెట్టి అక్కడ నుంచి దాన్ని పంపించినట్లు తెలుస్తోంది.లేదంటే ఆ పులి ఆవుని కచ్చితంగా చంపి తినేసేదేమో అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube