ఇదేందయ్యా ఇది.. ఇలా కూడా డ్యాన్స్ చేస్తారా.. వీడియో చూస్తే నవ్వాగదు!

మ్యూజిక్ వినగానే ఎలాంటి వారైనా లేచి స్టెప్పులు వేయడం మొదలు పెడతారు.ఇక డ్యాన్సర్స్ అయితే పాట ఎక్కడ వినపడ్డా వెంటనే స్టెప్పులు వేస్తుంటారు.

 This Is This.. Do You Dance Like This I Can't Help But Laugh When I Watch The Vi-TeluguStop.com

మ్యూజిక్‌కి అలాంటి మహిమ ఉంది మరి.ఒకరకంగా చెప్పాలంటే డ్యాన్స్ అనేది ఒక్క ఎక్స్‌సర్‌సైజ్ లాంటిది.డ్యాన్స్ వేసే సమయంలో బాడీలోని పార్ట్స్ అన్ని షేక్ అవుతుంది ఉంటాయి.దాంతో కండరాలలో ఉన్న ఎక్స్‌ట్రా ఫ్యాట్ కరుగుతుంది.అందుకే డ్యాన్స్ రాని వారు కూడా డ్యాన్స్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.కానీ కొంతమంది మాత్రం డ్యాన్స్ వేయాలని ఉన్నా కూడా సిగ్గుపాడుతూ లోలోపల స్టెప్పులు వేస్తూ ఉంటారు.

ఇంకొంతమంది టాలెంట్ ఉన్న కూడా సరైన ఫ్లాట్ ఫామ్ దొరకదు.అలాంటి వారికి సోషల్ మీడియా ఎంతగానో హెల్ప్ అవుతుంది.

ఇంటర్నెట్ వినియోగం పెరిగిన దగ్గర నుంచి సోషల్ మీడియా వేల కొద్దీ డ్యాన్స్ వీడియోలు అప్‌లోడ్ అవుతున్నాయి.వాటిలో కొన్ని వీడియోలోని స్టెప్పులు చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది.

మరి కొన్ని డ్యాన్స్ వీడియోలు ఆడియన్స్ ని కడుపుబ్బ నవ్విస్తుంటాయి.ప్రస్తుతం అలాంటి డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.

ఈ వీడియోలో ఒక ఫంక్షన్‌లో ఒక వ్యక్తి మంచి హిట్ సాంగ్ అయిన ‘తారే గిన్ గిన్ యాద్’ హిలేరియస్ స్టెప్పులు వేశాడు.మొదటగా పాటని కామ్ గా విన్న ఆ వ్యక్తి తరువాత సడన్ గా పూనకం వచ్చినట్లుగా డ్యాన్స్ వేయడం మొదలు పెట్టాడు.

అతని డ్యాన్స్ చూసి అక్కడ ఉన్న కొంతమంది ఆశ్చర్యపోతే మరికొంతమందేమో పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు.ఈ ఫన్నీ డాన్స్ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.కాగా ఈ క్లిప్‌ని ఇప్పటికే 1.1 లక్షల మంది లైక్ చేసారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube