దుస్తుల‌పై టీ, కాఫీ మ‌ర‌క‌లు వ‌ద‌ల‌డం లేదా? అయితే ఇవి ట్రై చేయండి!

ఉద‌యం లేవ‌గానే టీ లేదా కాఫీ తాగే అల‌వాటు చాలా మందికి ఉంటుంది.కొంద‌రైతే ఉద‌య‌మే కాదు మధ్యాహ్నం, సాయంత్రం, ఆఖ‌రికి రాత్రి నిద్రపోయే ముందు కూడా టీ, కాఫీల‌ను సేవిస్తుంటారు.

 How To Get Rid Of Tea Coffee Stains On Clothes! Tea Coffee Stains, Stains On Clo-TeluguStop.com

ఈ క్ర‌మంలోనే అప్పుడ‌ప్పుడు దుస్తుల‌పై టీ, కాఫీ ఒలికి మ‌ర‌క‌లు ప‌డుతుంటాయి.ఎన్ని సార్లు ఉతికినా ఆ మ‌ర‌క‌లు పోనేపోవు.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే సింపుల్ చిట్కాల‌ను ట్రై చేస్తే చాలా సుల‌భంగా టీ, కాఫీ మ‌ర‌క‌ల‌ను వ‌దిలించుకోవ‌చ్చు.మ‌రి లేటెందుకు ఆ చిట్కాలు ఏంటో ఓ లుక్కేసేయండి.

గుడ్డు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో, ఎన్ని విలువైన పోష‌కాల‌ను అందిస్తుందో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు.అయితే దుస్తులపై ప‌డిన టీ, కాఫీ మ‌ర‌క‌ల‌ను వ‌దిలించే సామ‌ర్థ్యం కూడా గుడ్డుకు ఉంది.

అందుకోసం గుడ్డులోని ప‌చ్చ‌సొన‌ను ఒక బౌల్‌లోకి తీసుకుని.అందులో కొద్దిగా ఉప్పు వేసి బాగా క‌ల‌పాలి.

ఈ మిశ్ర‌మాన్ని మ‌ర‌క‌లు ప‌డ్డ చోట వేసి బాగా రుద్ది.ఆపై సోప్‌తో దుస్తుల‌ను ఉతికితే టీ, కాఫీ మ‌ర‌క‌లు పోతాయి.

Telugu Coffee, Tips Stains, Latest, Lifestyle, Stains-Telugu Health Tips

అలాగే టీ, కాఫీ మరకలు పోవాలంటే.నెయిల్ పాలిష్ రిమూవర్ ను యూస్ చేయ‌వ‌చ్చు.మరక పడిన చోట నెయిల్ పాలిష్ రిమూవర్ వేసి రుద్దాలి.ఆ తర్వాత సబ్బుతో దుస్తులు ఉతకాలి.ఇలా చేసినా బట్టల పై ఉన్న టీ, కాఫీ మరకలు మాయం అవుతాయి.ఇక ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల

వైట్ టూత్ పేస్ట్, వ‌న్ టేబుల్ స్పూన్ లెమ‌న్ జ్యూస్

వేసుకుని క‌ల‌పాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని మరక పడిన ప్రదేశంలో వేసి ఓ ప‌ది నిమిషాల పాటు వ‌దిలేయాలి.ఆపై బాగా రుద్ది గోరు వెచ్చ‌ని నీటిలో శుభ్రంగా ఉత‌కాలి.

ఈ చిట్కాను ప్ర‌య‌త్నించినా టీ, కాఫీ మ‌ర‌క‌లు ఈజీగా తొల‌గిపోతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube