మహిళా దినోత్సవం రోజున వేగా జ్యుయలర్స్ నూతన షో రూమ్ ప్రారంభం..డైరెక్టర్ నవీన్‌కుమార్

గత రెండు దశాబ్దాలు కాలంగా కొనుగోలుదారుల ఆదరణాభిమానాలతో, ప్రోత్సాహంతో ముందుకు సాగుతున్నామ‌ని వేగా జువెల్ల‌ర్స్ డైరెక్టర్ నవీన్‌కుమార్ తెలిపారు.త‌మ సేవలను మ‌రింత విస్త‌రించ‌డంలో భాగంగా షాపింగ్ చేయ‌డంలో అద్భుతమైన అనుభూతిని పొందే విధంగా ఒక వినూత్న రీతిలో ఈ నెల 8న మహిళా దినోత్సవ రోజున వేగా జ్యుయలర్స్ నూతన షో రూమ్ ప్రారంభిస్తున్నట్లు అయన తెలిపారు.

 Vega Jewellers New Show Room Opening On Women's Day..director Naveen Kumar , Veg-TeluguStop.com

వేగా జువెల్ల‌ర్స్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని సంస్థ డైరక్టర్లు నవీన్‌కుమార్, సుధాకర్‌ల స‌మ‌క్షంలో మ‌హాత్మాగాంధీ రోడ్డులోని ట్రెండ్ సెట్ మాల్‌లోని స్క్రీన్ థియేట‌ర్‌లో నిర్వ‌హించిన టీజర్ కార్యక్రమం అట్ట‌హాసంగా సాగింది.టీజ‌ర్ అనంత‌రం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో సంస్థ డైరెక్టర్ న‌వీన్‌కుమార్‌ మాట్లాడుతూ,వేగా జ్యుయలర్స్‌కి ప్రచారకర్తగా నియమితులైన ప్ర‌ముఖ సినీన‌టుడు నంద‌మూరి బాలకృష్ణ పోస్టర్ ఆవిష్కరించామ‌న్నారు.

నందమూరి బాలకృష్ణ వేగా జ్యుయలర్స్ బ్రాండ్ అంబాసిడర్ కావడం త‌మ అదృష్టంగా భావిస్తున్న‌ట్లు చెప్పారు.

నంద‌మూరి బాల‌కృష్ణ ఒక వాణిజ్య ప్రకటనకు ప్రచారం చేయటం ఇదే ప్రప్రధమం అని తెలిపారు.గ‌డ‌చిన రెండుదశాబ్దాలు కాలంగా ఆదరిస్తు విశ్వసిస్తున్న త‌మ ఖాతాదారులకు నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా స్వచ్చమైన ఆభరణాలను వారు ఆశించిన విధంగా అందించాలన్న‌దే త‌మ ల‌క్ష్యం అన్నారు.8న వేగా జ్యుయలర్స్ షోరూం ప్రారంభోత్సవ సందర్భంగా ఆభరణాల కొనుగోలుపైన పలురకాల రాయితీలు కల్పిస్తున్నట్లు చెప్పారు.మగవారికి, మహిళలకు మరియు చిన్నారులకు కావాల్సిన అన్నిరకాల బంగారు, వెండి, వజ్రాభరణాలు పూర్వపు సాంప్రదాయత నుంచి నేటి ఆధునిక ఫ్యాషన్స్ వరకు అన్ని విస్త్రుత శ్రేణులలో లభిస్తాయని, షాపింగ్ చేయ‌డంలో ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తాయని అయన పేర్కొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube