వీరసింహారెడ్డి సినిమా ఫస్ట్ రివ్యూ ఇదే.. సినిమా ఎలా ఉండబోతుందంటే?

సంక్రాంతి పండుగ కానుకగా విడుదలవుతున్న వీరసింహారెడ్డి సినిమాకు సోలో రిలీజ్ దక్కిందనే సంగతి తెలిసిందే.ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 1700 థియేటర్లలో ఫస్ట్ డే ప్రదర్శితం కానుందని సమాచారం అందుతోంది.

 Veerasimhareddy Movie First Review Details Here Goes Viral In Social Media ,vee-TeluguStop.com

ఇప్పటికే బుక్ మై షో యాప్ లో ఈ సినిమాకు సంబంధించిన బుకింగ్స్ మొదలయ్యాయి. 2 గంటల 50 నిమిషాల నిడివితో ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతోంది.

నిడివి ఎక్కువైనా కంటెంట్ ఆకట్టుకునేలా ఉండనుందని సమాచారం.

తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ రాగా సెన్సార్ సభ్యులు ఈ సినిమా గురించి పాజిటివ్ గా స్పందించారని సమాచారం అందుతోంది.అయితే ప్రముఖ సినీ క్రిటిక్ ఉమైర్ సంధు కూడా ఈ సినిమా గురించి స్పందిస్తూ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు.ఈ సినిమాకు ఆయన ఏకంగా 3.5 రేటింగ్ ఇవ్వడం గమనార్హం.బాలయ్య నటన ఈ సినిమాకు హైలెట్ అని ఆయన చెప్పారు.

బాలకృష్ణ ఈ సినిమాలో అద్భుతంగా నటించారని ఉమైర్ సంధు అభిప్రాయం వ్యక్తం చేశారు.క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ వచ్చే సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన కామెంట్లు చేశారు.కథ, కథనం మరీ కొత్తగా లేదని అయితే యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

పాటలు, డ్యాన్స్ లు బాగున్నాయని కొన్ని ఎమోషనల్ సీన్స్ ఒకేలా ఉండబోతున్నాయని సమాచారం.

వరలక్ష్మి బాలయ్యకు సొంత చెల్లి కాదని ఆమె నటనే సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని సమాచారం.క్రాక్ సినిమాలోని జయమ్మ రోల్ ను మించి ఈ సినిమా ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.వీరసింహారెడ్డి సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగానే ఉన్నాయి.

సంక్రాంతి పండుగ కానుకగా రిలీజవుతున్న ఈ సినిమా విందు భోజనం లాంటి మూవీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube