మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలను నైజాంలో మైత్రీ సంస్థ సొంతంగా రిలీజ్ చేసింది.థియేటర్ల విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా మైత్రీ సంస్థ ధైర్యం చేసి సినిమాలను రిలీజ్ చేయగా వాల్తేరు వీరయ్య హిట్ గా నిలిస్తే వీరసింహారెడ్డి సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
సంక్రాంతికి సినిమాలను చూసే ప్రేక్షకులలో 60 శాతం మంది వాల్తేరు వీరయ్యపై దృష్టి పెడితే 40 శాతం మంది వీరసింహారెడ్డి చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.
అయితే ఫుల్ రన్ లో వీరసింహారెడ్డి సీడెడ్, ఓవర్సీస్ మినహా కొన్ని ఏరియాలలో నష్టాలను మిగిల్చే ఛాన్స్ ఉంది.
అయితే నిర్మాతలకు మాత్రం వాల్తేరు వీరయ్య సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్లు వస్తుండటంతో ఈ సినిమాతో లాభాలు వస్తున్నాయని సమాచారం అందుతోంది.రెండు సినిమాలకు అన్ని ఏరియాలలో బయ్యర్లు ఒకటే కావడంతో ఇబ్బందులు తలెత్తలేదని సమాచారం.
వాల్తేరు వీరయ్యకు లాంగ్ రన్ ఉండటం బయ్యర్లకు ప్లస్ అయింది.ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్ తోనే తెరకెక్కినా నిర్మాతలకు చెప్పుకోదగ్గ స్థాయిలోనే లాభాలు మిగిలాయని సమాచారం.మైత్రీ మూవీస్ రూపంలో దిల్ రాజుకు నైజాంలో గట్టి పోటీ మొదలైందని రాబోయే రోజుల్లోకూడా మైత్రీ సంస్థ నైజాంలో సొంతంగానే సినిమాలను రిలీజ్ చేయనుందని సమాచారం అందుతోంది.
దిల్ రాజు మాత్రమే ఇప్పటివరకు నైజాంలో కింగ్ అనిపించుకోగా పరిస్థితులు మారుతున్నాయి.మరోవైపు వారసుడు మూవీ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కావడం కూడా కష్టమేనని తెలుస్తోంది.వీరసింహారెడ్డి ఆశించిన ఫలితాన్ని అందుకోకపోయినా గోపీచంద్ మలినేనితో పని చేయడానికి స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.