గ్యాస్ స్టవ్ ను ఈ దిక్కులో ఉంచితే ఇంటికి మంచిదా...

మన దేశంలోనే చాలామంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని ఎంతో గట్టిగా నమ్ముతారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏ ప్రదేశంలో ఏ వస్తువులు ఉంచుకోవాలో కచ్చితంగా వాటినే ఉంచుకుంటారు కొంతమంది.

 Vastu Shastra Vastu Tips For Your Kitchen For Happiness And Prosperity,kitchen,v-TeluguStop.com

మరికొంతమంది వారి ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకుంటూ ఉంటారు.వాస్తు శాస్త్రం ప్రకారం వంటగది ఏ దిశలో ఉండాలి అనే ఖచ్చితంగా చూసుకుంటూ ఉంటారు.

ఇంటికి ఆగ్నేయ మూలలో వంటగది ఉండడం మంచిది.ఎందుకంటే అగ్ని ప్రతీకాత్మకంగా త్రిభుజాకారంలో ఉంటుంది.వంటగది ఇంట్లో ఒక భాగం కాబట్టి వాస్తు ప్రకారం ఆదర్శ దిశకు అనుగుణంగా దాని స్థానం ఉండాలి.కానీ వంటగది దిశా సరిగ్గా ఉండకుంటే ఆ కుటుంబానికి అంత మంచిది కాదు.

ఆ ఇంట్లో నిత్యం సమస్యలు, గొడవలు జరుగుతుంటాయి.ఇంట్లో వంటగదితోపాటుగా సింక్, గ్యాస్ స్టవ్ సరైన దిశలో ఉండాలి.

ఎందుకంటే ఇవి సరైన దిశలో ఉన్నట్లయితే ఇంట్లో సంతోషం శ్రేయస్సు అనేది ఆధారపడి ఉంటుంది.ఇంటి శ్రేయస్సును కాపాడుకోవడానికి స్టవ్, సింక్ మధ్య సరైన దూరం ఉండడం ఎంతో మంచిది.

Telugu Astrology, Kitchen, Kitchen Tips, Vastu, Vastu Sastram, Vastu Tips-Telugu

వంటగదికి సింక్ స్థానానికి మధ్య ప్రత్యేక సంబంధం ఉంటుంది.వంటగదిలో సింక్ ఈశాన్య దిశలో ఉంటే గ్యాస్ స్టవ్ ఆగ్నేయంలో ఉండడంవల్ల ఎంతో మేలు.నైరుతి భాగంలో రిఫ్రిజిరేటర్ ఉండాలి.ఈ మూడు త్రిభుజాలు కాబట్టి,ఈ మూడు సరైన దిశలో ఉంటే ఆ ఇంట్లో ఆనందం ఉంటుంది.లేదంటే ఇంట్లో మహిళలపై నెగిటివ్ ఎనర్జీ ప్రభావాన్ని చూపుతుంది.

సింక్, గ్యాస్ స్టవ్ రెండు దగ్గర్లో ఉన్నట్లయితే కుటుంబ సభ్యులందరిని ఇబ్బందులకు గురిచేస్తుంది.

అందువల్ల సింక్, గ్యాస్ స్టౌవ్ మధ్య బాగా దూరం ఉండాలని వాస్తు శాస్త్రం చెబుతోంది.కొన్నిసార్లు ఇంటి నిర్మాణ సమస్యల సింక్ ,స్టవ్ మధ్య దూరం తక్కువగా ఉంటుంది.

అయితే వాటి మధ్య దూరాన్ని పెంచడం సాధ్యం కాకపోతే చెక్కబొడ్డు స్క్రీన్ లేదా గాజును అడ్డంగా ఉంచడం కూడా మంచిది.వీటి రెండింటి మధ్య ఇలాంటి అడ్డుని ఉంచడం కూడా మంచిదే అని వాస్తు శాస్త్రం చెబుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube