ఒక డ్రోన్ ఆపరేటర్ కాంతారా ఘనవిజయం లో కీలకం అని మీకు తెలుసా ?

కాంతారా సినిమా ఘనవిజయం సాధించడం తో ఈ సినిమాకు సంబదించిన అనేక విషయాల పై టాలీవుడ్ లో విపరీతమైన చర్చ సాగుతుంది.ఈ చిత్రం లో నటీనటుల పెరఫార్మెన్స్, సంగీతం, కథ అన్ని చక్కగా సెట్ అవ్వడం తో మంచి హిట్టు అయ్యిందని చెప్పచ్చు.

 Person Behind Kanthara Movie Success Cinematographer Aravind Details, Kantara, H-TeluguStop.com

అయితే ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన అర్వింద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే.కొన్నేళ్ల నుంచి రిషబ్ శెట్టి తో ఎంతో మంచి స్నేహితుడిగా ఉన్న అర్వింద్ అతడి సినిమాలతో పాటే ఎదిగాడు.

రిక్కీ సినిమా సమయం లో అర్వింద్ ని డ్రోన్ ఆపరేటర్ గా పని చేయడానికి తీసుకున్నాడు రిషబ్.

ఆ తర్వాత సినిమా సినిమాకు అర్వింద్ టెక్నికల్ గా పట్టు సాధిస్తూ వచ్చాడు.

ఆ తర్వాత లూసియా సినిమా కోసం అసిస్టెంట్ దర్శకుడిగా అవతారం ఎత్తాడు.అంతలా అన్ని బాద్యతలు నమ్మి రిషబ్ అర్వింద్ చేతిలో పెట్టాడు.

ఇక అర్వింద్ తనకు అప్పచెప్పిన బాధ్యత సక్రమం గా నెరవేర్చి రిషబ్ నమ్మకాన్ని దక్కించుకున్నాడు.ఇక రిషబ్ కిరిక్ పార్టీ సినిమా తీయడానికి సిద్ధం అవ్వగానే అర్వింద్ అసోసియేట్ కెమెరా మ్యాన్ గా హోదా పొందాడు.

కేవలం రిషబ్ నమ్మడం తో అర్వింద్ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు.ఇక కాంతారా సినిమా సమయానికి అర్వింద్ సినిమాటోగ్రాఫర్ గా పని చేసాడు.

Telugu Aravind Kashyap, Arvind, Drone, Rishab Shetty, Kantara, Rishabshetty-Movi

ఇలా అర్వింద్ కాంతారా సినిమా విజయం లో కీలక వ్యక్తిగా ఎదిగాడు.ఒకప్పటి డ్రోన్ ఆపరేటర్ గా మొదలెట్టి సినిమాటోగ్రాఫర్ గా మారిపోయాడు.ఆలా ఒక సినిమా కోసం ఎలాంటి వ్యక్తులను నియమించుకోవాలో రిషబ్ కి తెలిసినంత గా ఎవరికి తెలియదు.ఈ సినిమా విజయం తర్వాత మళ్లీ ఎవరి సినిమాలు ఒప్పుకోకుండా కేవలం రిషబ్ కోసం మాత్రమే పని చేయాలనుకుంటున్నాడు అర్వింద్.

ఇలా సినిమా సక్సెస్ కోసం అందరు ప్రాణాలు పెట్టి పని చేసారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube