సినిమా ఇండస్ట్రీ కి వచ్చిన నటి నటులు వాళ్ల నటన తో జనాలని ఆకట్టుకుంటే పర్లేదు కానీ వాళ్ల నటన బాగలేకపోయిన వాళ్ల శరీరాకృతి సరిగా లేకపోయినా వాళ్ళని అందరూ ట్రోల్ చేస్తూ ఉంటారు.అయితే ఈ ట్రోలింగ్స్ అనేవి సోలో గా ఇండస్ట్రీ కి వచ్చిన పర్సన్స్ కి తక్కువ గా ఉన్నప్పటికీ వారసత్వం గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన వాళ్ళని ఎక్కువ ట్రోల్ చేస్తూ ఉంటారు…
అయితే శరత్ కుమార్ కూతురిగా ఇండస్ట్రీ కి వచ్చిన వరలక్ష్మి శరత్ కుమార్ మొదట్లో చాలా కామెంట్లను ఎదురుకుంది.చాలా లావు గా ఉంది, ఈమెకి యాక్టింగ్ కూడా రాదు అంటూ ఈమె మీద చాలా రకాల కామెంట్లు వచ్చాయి అవి అన్నీ వింటుంటే ఆమెకి చాలా భాద అనిపించేదట ఒక్కోసారి ఆ కామెంట్లను వినలేక సూసైడ్ కూడా చేసుకోవాలి అని అనిపించేదట కానీ అలా చేయకూడదు ఈ కామెంట్లు చేసేవాల్లకి నేనేంటో నా యాక్టింగ్ ఏంటో సినిమాల్లో చేసి చూపిస్తా అనే ఒక సంకల్పాన్ని పెట్టుకొని ముందుకు సాగింది…
తను అనుకున్నట్టు గానే రోజు రోజు కీ తన యాక్టింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉత్తమ నటిగా పేరు సంపాదించుకుంది ఇప్పటికే చాలా అవార్డులు కూడా అందుకుంది…అలా తన నటనతోనే కామెంట్లు చేసిన వాళ్ళకి సమాధానం చెప్పింది…ఇక రీసెంట్ గా బాలయ్య సినిమా అయిన వీరసింహ రెడ్డి సినిమా తో మంచి విజయాన్ని అందుకుంది అలాగే ఈ సినిమా లో బాలయ్య బాబు తో పాటు తను పోటీ పడి నటించిందనే చెప్పాలి.దీనికంటే ముందే ఈ సినిమా డైరెక్టర్ అయిన గోపి చంద్ మలినేని డైరెక్షన్ లో క్రాక్ సినిమాలో నటించి లేడీ విలన్ గా మంచి పేరు తెచ్చుకుంది…