ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా వరలక్ష్మి శరత్ కుమార్ పేరు బాగా మారు మ్రోగుతుంది.అతి తక్కువ సమయంలో తెలుగు ప్రేక్షకులను తన నటనతో ఫిదా చేసేసింది ఈ బ్యూటీ.
ఇక వరలక్ష్మి శరత్ కుమార్ ఎవరో కాదు ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శరత్ కుమార్ కూతురే వరలక్ష్మి.అలా తన తండ్రి పేరును తన పేరుకు జోడించుకుంది వరలక్ష్మి.
అలా వరలక్ష్మి నటిగా అడుగుపెట్టి ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ భాషలలో నటించి మంచి పేరు సంపాదించుకుంది.తన నటనకు ఉత్తమనటి అవార్డు కూడా సొంతం చేసుకుంది.2012 తమిళ సినిమాతో తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఆ తర్వాత మలయాళం, కన్నడ ఇండస్ట్రీలో అడుగు పెట్టి.2019లో తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది.
ఆ మధ్యనే క్రాక్, నాంది సినిమాలో నటించి తన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసేసింది.అలా తెలుగులో కూడా మంచి సక్సెస్ అందుకుంది.ఇక ప్రస్తుతం పలు ప్రాజెక్టులో బిజీగా ఉంది.ఇక యశోద సినిమాలో కూడా వరలక్ష్మీ శరత్ కుమార్ నెగటివ్ రోల్ చేసింది.
ఇక్కడ కూడా బాగా మార్కులు సంపాదించుకుంది.అంతేకాకుండా ఇటీవలే సంక్రాంతి సందర్భంగా విడుదలైన వీరసింహారెడ్డి సినిమాలో మాత్రం బాలకృష్ణ కు పోటీగా నిలిచింది వరలక్ష్మి శరత్ కుమార్.
ఈ సినిమాలో తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఏకంగా విమర్శకులు సైతం ఫిదా అయ్యారు.మొత్తానికి టాలీవుడ్ లో రమ్యకృష్ణ తర్వాత లేడీ విలన్ గా మెప్పించింది అంటే అది వరలక్ష్మి శరత్ కుమార్ అనే అంటున్నారు తెలుగు ప్రేక్షకులు.
మొత్తానికి తెలుగు ఇండస్ట్రీలో లేడీ విలన్ దొరికేసింది అని తెగ సంబరపడిపోతున్నారు.
ఇప్పటివరకు తమిళంలోనే వరలక్ష్మికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది.కానీ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో కూడా ఈమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది.ఈమె సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.
ఒక వీర సింహారెడ్డి సినిమా తర్వాత సోషల్ మీడియాలో ఈమెకు ఫాలోవర్స్ సంఖ్య కూడా పెరిగిపోయింది.సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూనే ఉంటుంది.
అప్పుడప్పుడు తన డాన్స్ వీడియోలతో కూడా బాగా ఫిదా చేస్తుంది.అయితే తాజాగా తను ఇన్ స్టా వేదికగా ఒక డాన్స్ వీడియో షేర్ చేసుకుంది.అందులో తన డాన్స్ స్టెప్ లతో కుర్ర కారును ఆకట్టుకుంది.ఆ వీడియో చూసిన తెలుగు అభిమానులు మాత్రం.నీ కటౌట్ కి నువ్వు చేసే క్యారెక్టర్స్ కి ఏమైనా సంబంధం ఉందా అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.ఇక ప్రస్తుతం డాన్స్ వీడియో బాగా వైరల్ అవుతుంది.