Vaishnav Tej : వైష్ణవి తేజ్ టేస్ట్ ఏంటి ఇంత బ్యాడ్ గా ఉంది.. ఆశలు గల్లంతేనా ?

మెగా హీరో పంజా వైష్ణవ్‌ తేజ్ ( Vaishnav Tej )ఉప్పెన సినిమా( Uppena )తో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.నిజానికి తొలి సినిమాతోనే అతడు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.

 Vaishnav Tej Wrong Script Selections Back To Back-TeluguStop.com

ఈ మూవీ హిట్ కావడానికి కృతి శెట్టి అందం, దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రధాన కారణాలని చెప్పుకోవచ్చు.స్టోరీలో పెద్దగా ఏం లేకపోయినా క్లైమాక్స్ కొత్తగా ఉండటం వల్ల ఇది హిట్ అయింది.

ఆ తర్వాత వైష్ణవ్‌ తేజ్ “కొండపొలం” మూవీ( Konda Polam movie ) తీశాడు.అది ఫ్లాప్ అయ్యింది.

ఆపై “రంగ రంగ వైభవంగా” మూవీ తీస్తే అది కూడా నిరాశపరిచింది.ఇక రీసెంట్‌గా అతడు తీసిన “ఆదికేశవ” మూవీ కూడా ఊహించని రీతిలో నెగిటివ్ రివ్యూలు సంపాదించింది.

Telugu Adikeshava, Konda Polam, Rangaranga, Sai Dharam Tej, Srileela, Uppena, Va

ఔట్‌డేటెడ్ యాక్షన్ స్టోరీ, అతిగా అనిపించే యాక్షన్ సన్నివేశాలు, తలనొప్పి తెప్పించే సీన్ల కారణంగా ఈ మూవీ ఫెయిల్యూర్ టాక్ ఆల్రెడీ తెచ్చేసుకుంది.ఈ మెగా హీరో వరుసగా డిజాస్టర్లతో సతమతమవుతున్నాడు.అలాంటప్పుడు ఒక మూవీ ఎంచుకునేటప్పుడు ఆచితూచి ఎయించుకోవాలి. స్టోరీలో కొత్తదనం ఉందా? అది నేటి ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందా? థియేటర్లకు ప్రేక్షకులను పోటెత్తేలా చేసే అంత ఇంట్రెస్టింగ్ గా మూవీ ఉంటుందా? అనే ప్రశ్నలన్నీ వేసుకోవాలి.అప్పట్లో మెగాస్టార్ ఫైట్స్, డ్యాన్సులతో హిట్లు కొట్టాడు కదా, ఇప్పుడు కూడా అలాగే హిట్స్ కోసం ట్రై చేద్దామంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు.

Telugu Adikeshava, Konda Polam, Rangaranga, Sai Dharam Tej, Srileela, Uppena, Va

వైష్ణవి తేజ్ అన్న సాయి ధరమ్‌ తేజ్ కూడా విరూపాక్ష వంటి కొత్తరకం సినిమాలతో హిట్స్ కొడుతుంటే.తమ్ముడేమో ఇలా రొటీన్ రొడ్డ కొట్టుడు సినిమాలు ఎంచుకుంటూ నిరాశ పరుస్తున్నాడు.మొన్నీ మధ్య వచ్చిన ఆనంద్ దేవరకొండ కూడా మంచి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటూ భారీ హిట్స్ సాధిస్తున్నాడు.

మెగా హీరో అయి ఉండి, తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ సాధించి ఇప్పుడు ఇలాంటి చెత్త సినిమాలు వైష్ణవ్‌ ( Vaishnav Tej )ఎంచుకోవడం నిజంగా ఒక షాకింగ్ విషయమే అని చెప్పుకోవాలి.ఈ సినిమా తన స్థాయికి తగినది కాదని అతడు గుర్తించకపోవడం కూడా అందర్నీ విస్మయానికి గురిచేస్తుంది.

ఏది ఏమైనా ఇప్పటికైనా మేల్కొని అతడు కంటెంట్ సెలక్షన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే అల్లు శిరీష్ లాగా ఫెడవుట్ అవ్వడం ఖాయం.ఏ సినిమా ఎంచుకోవాలనేది తెలియకపోతే మెగా హీరోల హెల్ప్ అయినా తీసుకోవచ్చు.

బాగా హీరోయిజం చూపించే అతి సినిమాల జోలికి వెళ్తే చివరికి ఆదికేశవ లాంటి ఫలితాలనే చవిచూడాల్సి ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube