డైరెక్టర్ గిరీశాయ దర్శకత్వంలో రూపొందిన సినిమా రంగ రంగ వైభవంగా.ఇందులో మెగా హీరో వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ నటీనటులుగా నటించారు.
అంతేకాకుండా ఆలీ, ఫిష్ వెంకట్, సుబ్బ రాజు, రాజ్ కుమార్ కసిరెడ్డి తదితరులు నటించారు.శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్.ఎల్.బి బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మాతగా బాధ్యతలు చేపట్టాడు.దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.
శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ అందించాడు.మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న వైష్ణవ్ ఈ సినిమాతో ఎటువంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకోగా ఈరోజు మొత్తానికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా.
కథ:
కథ విషయానికి వస్తే.రిషి పాత్రలో వైష్ణవ్ తేజ్, రాధ పాత్రలో కేతికా శర్మ చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారు.వీరి కుటుంబాల మధ్య మంచి స్నేహం ఉంటుంది.కానీ రిషీ, రాధలు మాత్రం శత్రువులు.ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు.
ఇక పెద్దయ్యాక వీరిద్దరు ఓ మెడికల్ కాలేజీలో చేరతారు.అక్కడ కూడా వీరికి గొడవలు జరుగుతూనే ఉంటాయి.
ఆ తర్వాత రిషికి రాధపై ప్రేమ పుడుతుంది.కానీ పైకి కోపం చూపిస్తాడు.
ఇక వీరిద్దరు కలిసే సమయానికి వీరి కుటుంబాల మధ్య పెద్ద గొడవలు మొదలవుతాయి.ఇక వీరి కుటుంబాలకు ఏం గొడవలు జరుగుతాయి.
చివరికి రిషి, రాధ ఒక్కటవుతారా లేదా మిగిలిన కథలోనిది.
నటినటుల నటన:
వైష్ణవ్ తేజ్ తన నటనతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.నిజానికి తన పాత్రతో, అందులో తన డైలాగులతో బాగా ఆకట్టుకున్నాడు.ఇక హీరోయిన్ కూడా అద్భుతంగా నటించింది.మిగతా నటీనటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
టెక్నికల్:
దేవి అందించిన పాటల్లో రెండు బాగున్నాయి.నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది.ఎడిటింగ్ పరవాలేదు అన్నట్లుగా ఉంది.ఇక సినిమాటోగ్రఫీ బాగుంది.సినిమాలో దృశ్యాలన్నీ చాలా అందంగా చూపించారు.
విశ్లేషణ:
ఈ సినిమాకు దర్శకుడు రొటీన్ కథను అందించగా కథనం విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ పెడితే బాగుండేది.ఇక నటీనటుల పాత్రలను కూడా బాగానే చూపించాడు.చాలా వరకు సినిమాను తెరపై బాగా చూపించడానికి ప్రయత్నించాడు డైరెక్టర్.
ప్లస్ పాయింట్స్:
సినిమా కథ, హీరో హీరోయిన్ నటన, కామెడీ, దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్, డైలాగ్స్, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది.
మైనస్ పాయింట్స్:
అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు సాగినట్లు అనిపించాయి.కొన్ని సన్నివేశాలు బోరింగ్ గా అనిపించాయి.రొటీన్ కథ లాగా అనిపించింది.
బాటమ్ లైన్:
రొటీన్ కథగా అనిపించినా కూడా మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక కామెడీ సీన్స్ కోసం, దేవిశ్రీ మ్యూజిక్ కోసం, వైష్ణవ్ తేజ్ నటన కోసం ఈ సినిమా చూడవచ్చు అని చెప్పవచ్చు.