వెరైటీగా కారును డిజైన్ చేశారు.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..

చాలా మందికి ఇతరుల కంటే భిన్నంగా ఉండాలనే ఆలోచన ఉంటుంది.ఈ కారణంతో తమ అభిరుచికి అనుగుణంగా జీవిస్తుంటారు.

 Usa Man Disigns Strange Upside Down Car Video Viral Details, Variety Car, Weird-TeluguStop.com

తాము వాడే వస్తువులు కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటుంటారు.ఇదే కోవలో ఓ వ్యక్తి తన కారును విభిన్నంగా డిజైన్ చేసుకున్నాడు.

అది చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.ఆ కారును చూస్తే రివర్స్‌లో ఉందేమో అనిపిస్తుంది.

కింద ఉండాల్సిన చక్రాలు పైన కూడా ఉన్నాయి.ఆ కారు డిజైన్ కూడా రివర్స్‌లో ఉందేమో అనేలా సరికొత్తగా డిజైన్ చేశారు.

దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా విపరీతంగా వైరల్ అవుతోంది.

దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

అమెరికాలోని ఇల్లనాయిస్‌ ప్రాంతానికి చెందిన మిస్టర్ సుల్లివన్ అనే వ్యక్తి వెరైటీ కారును తయారు చేశాడు.బయటకు అది 1995 నాటి ఫోర్డ్ F-150 యొక్క బాడీ షెల్.

ఇది 1991 ఫోర్డ్ రేంజర్ పికప్ రన్నింగ్ ఛాసిస్‌పై ఫిట్‌గా ఉండేలా అక్కడక్కడ కత్తిరించబడింది.తన సొంత గ్యారేజీలోని భాగాల నుండి టాప్సీ-టర్వీ ట్రక్కును పూర్తి చేయడానికి రిక్ ఆరు నెలలు కష్టపడి 2014లో ఆ కారును తయారు చేశాడు.

దానికి అప్పట్లో $6,000 వ్యయం అయింది.అన్ని కార్ల మాదిరిగానే దానికి విండోలు, నంబర్ ప్లేట్, హెడ్ లైట్లు కూడా ఉన్నాయి.కేవలం టైర్లు మాత్రమే పై భాగంలో దర్శనమిచ్చేలా విభిన్నంగా దర్శనం ఇస్తున్నాయి.@Lance అనే ట్విట్టర్ ఖాతాలో దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు.ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.ఈ కారు ప్రమాదానికి గురైనా తలకిందులుగా దీనిని నడిపేయొచ్చని కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube