రాధికా ఆప్టే( Radhika apte )… చాల చిన్న వయసులోనే భారమైన పాత్రలను మోయడానికి సైతం వెనకాడని తక్కువ మంది నటీమణుల్లో ఒకరు.ఈమె తన 20 ఏళ్ళ వయసులోనే సినిమా రంగానికి వచ్చింది.
తెలుగు లో రక్త చరిత్ర ( Rakta Charitra )అనే సినిమా ద్వారా మనకు పరిచయం అయ్యింది.థియేటర్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన రాధికా చాల బోల్డ్.

ఆమెకు నచ్చినట్టే చేస్తుంది.ఏది అనిపిస్తే అది మాట్లాడుతుంది.ఒంట్లో కేజీ కండ లేదు కానీ మాటలకూ ఏం తక్కువ లేదు అనే మాటలు తరుచుగా ఈమె గురించి మాట్లాడుకుంటారు.ఆమె 18 ఏళ్ళ కెరీర్ లో చాల కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఇచ్చింది.
ఇక ఒక ఫారెనర్ ని పదేళ్ల క్రితమే వివాహం చేసుకొని గ్లామర్ పాత్రలకు కేరాఫ్ అడ్డ్రస్సు గా నిలిచింది.

రాధికా తెలుగు లో రక్త చరిత్ర రెండు భాగాలు మరియు లయన్ సినిమాల్లో మాత్రమే కనిపించింది కానీ ఆమె నటించిన అనేక సినిమాలు తెలుగు లో కూడా దబ్ అవుతూ ఉంటాయి.ఇక రజినీకాంత్ కబాలి సినిమా(Kabali )లో ఆయనకు భార్యగా ముసలి పాత్రలో కనిపించి ఆమె అభిమానులకు షాక్ ఇచ్చింది.రాధికా ఆది నుంచి వయసుకు మించిన పాత్రల్లోనే కనిపిస్తూ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ వెళ్తుంది.
ఇక చివరగా mrs అండర్కవర్ అనే సినిమాలో కనిపించింది.ఈ సినిమా వసూళ్ల సంగతి పక్కన పెడితే ఇందులో రాధికా ఆప్టే నటన మాత్రం అద్భుతం.

రాధికా ఎక్కువ సినిమా కంటెంట్ కూడా ఓటిటి కంటెంట్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టి ఆమెకు అవకాశాలు సంపాదించుకోవడం లో ముందుంటుంది.ఇక బుల్లి తెర వెండి తెర అనే తేడా ఏమి లేదు.అందుకే యూట్యూబ్ లో కూడా నటిస్తుంది.ఆమె నటించిన అనేక షార్ట్ ఫిలిమ్స్ మంచి గుర్తింపును దక్కించుకున్నాయి.ఇటీవల రాధికా షార్ట్ ఫిలిమ్స్ తగ్గించింది కానీ తనకు మొట్ట మొదటి సారి అవకాశం ఇచ్చిన థియేటర్ ని మాత్రం వదలడం లేదు.ఇప్పటికి ఆమె థియేటర్స్ లో నటిస్తూ తన నటన ను బాగా డెవలప్ చేసుకుంటుంది.
అందుకే రాధికా ఆప్టే లాంటి హీరోయిన్స్ ఇండస్ట్రీ ఖచ్చితంగా అవసరం.