మరో చరిత్ర( Maro Charitra ).ఇప్పటికి ఈ సినిమా ఒక చరిత్ర.
ఎంతమంది ఇంతగొప్ప సినిమాలు తీసిన ఈ సినిమాకు ఉన్న ఆ ఎమోషన్ క్యారీ చేయలేదు.ఈ ఒక్క సినిమా వల్ల ఎంతో మంది ప్రేమికులు ప్రోత్సాహం పొంది ఆత్మహత్య చేసుకున్నారు.ప్రేమిస్తే కలిసి ఉండాలి లేదంటే కలిసి చచ్చిపోవాలి అనే ఒక సూత్రం తో ఈ చిత్రం తెరకెక్కించారు డైరెక్టర్ బాలచందర్.1978 లో విడుదల అయినా ఈ చిత్రం కేవలం తెలుగు లో నే తీశారు.అయితే తమిళ్ డైరెక్టర్ అయినా బాలచందర్( K.Balachander ) ఈ సినిమా తెలుగు లో భారీ విజయం దక్కించుకున్నాక తమిళ్ లో రీమేక్ చేస్తాను అని భావించారు.కానీ కమల్ హాసన్ దానికి అడ్డు చెప్పారు.

ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ ఒకరు తెలుగు అయితే మరొకరు మద్రాసి .అందుకే సినిమాలో ఎక్కువగా తమిళ డైలాగ్స్ కూడా ఉండటం వల్ల మళ్లి సెపరేట్ గా తమిళ్ లో రీమేక్ చేయడం లో అర్ధం లేదు అని చెప్పారు.దాంతో ఈ సినిమాను తమిళ్ లో కూడా తెలుగు బాషలోనే విడుదల చేసి తమిళ్ లో సబ్ టైటిల్స్ వేసి విడుదల చేయగా అక్కడ కూడా పెద్ద విజయాన్ని అందుకుంది.

అలా మొట్టమొదటి సారి తమిళుల సౌలభ్యం కోసం తెలుగు సినిమా విడుదల చేస్తే వారు ఈ చిత్రాన్ని విజయవంతం చేసారు.ఇలా ఒక సినిమాను ఇండియాలో సబ్ టైటిల్స్ తో వేయడం అనేది మొట్ట మొదటి సారి కావడం విశేషం.ఇక హిందీ, కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని రీమేక్ చేసారు.అవి కూడా మంచి కల్ట్ ఆడియెన్స్ ని దక్కించుకున్నాయి.

ఇప్పటికి ఈ సినిమ వస్తే అందులో బ్యాగ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ వినిపిస్తే చాలు ఎదో తెలియని అలజడి మొదలవుతుంది.ఈ చిత్రం ద్వారానే తొలిసారి హిందీ లో కమల్ హాసన్ డెబ్యూ జరిగింది.అంతే కాదు మాధవి మరియు ఎస్పీ బాలసుబ్రమణ్యం( S.P.Balasubrahmanyam ) కూడా ఈ సినిమా ద్వారానే హిందీ ప్రేక్షకులకు తొలిసారిగా పరిచయం అయ్యారు.బాలచందర్ స్వయంగా మిగతా భాషల్లో దాన్ని డైరెక్ట్ చేసారు.
ఈ తెలుగు మరో చరిత్ర చిత్రానికి బెస్ట్ డైరెక్టర్ గా ఫిలిం ఫేర్ అవార్డు కూడా అందుకున్నారు బాలచందర్.







