భారత్ కు షాక్ ఇచ్చిన యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్.. భారత రెజ్లింగ్ సమాఖ్యపై సస్పెన్షన్ వేటు..!

తాజాగా భారత రెజ్లింగ్ ( Indian wrestling )సమాఖ్య సభ్యత్వాన్ని నిరవధికంగా సస్పెండ్ చేస్తున్నట్లు యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ప్రకటించింది.సమాఖ్య ఎన్నికలు నిర్వహించడంలో భారత రెజ్లింగ్ సమాఖ్య విఫలం కావడం వల్లనే సస్పెన్షన్ వేటు వేసినట్లు యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ వెల్లడించింది.

 United World Wrestling Gave A Shock To India Suspension Of Indian Wrestling Fede-TeluguStop.com
Telugu Brijbhushan, India, Latest Telugu, Olympic-Sports News క్రీడల

ఈ సస్పెన్షన్ కారణంగా భారత రెజ్లర్లు రాబోయే ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం ఉండదు.సెప్టెంబర్ 16 నుంచి ప్రపంచ ఛాంపియన్ షిప్ టోర్నీలో భారత రెజ్లర్లు తటస్థ అట్లెట్లుగా పోటీ పడాల్సి ఉంది.కానీ భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికల నిర్వహించకపోవడం వల్ల సస్పెన్షన్ వేటు పడింది.యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ అడహక్ కమిటీకి బుధవారం రాత్రి సమాచారం ఇచ్చింది.ఈ విషయాన్ని భారత ఒలంపిక్ అసోసియేషన్ ( Olympic Association )వర్గాలు వెల్లడించాయి.

Telugu Brijbhushan, India, Latest Telugu, Olympic-Sports News క్రీడల

భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్( Brij Bhushan Saran Singh ) పై మహిళ రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా డబ్ల్యూఎఫ్ఐ వివాదం లో చిక్కుకుంది.ఈ క్రమంలో శరణ్ సింగ్ ను పదవి నుంచి తప్పించాలని ఆందోళన చేయడంతో డబ్ల్యూఎఫ్ఐ ప్యానల్ IOA రద్దు చేసింది.దీంతో ఆ తరువాత కార్యకలాపాల నిర్వహణ అడ్హక్ కమిటీకి అప్పగించింది.

ఆగస్టు 27న ఈ కమిటీ ఏర్పాటవ్వగా.అక్కడి నుంచి 45 రోజుల్లో డబ్ల్యూఎఫ్ఐ ప్యానల్ ఎన్నికలు నిర్వహించాలి.

యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ఏప్రిల్ 28న స్పందిస్తూ.గడువులోపు ఎన్నికలు పూర్తి చేయాలని లేదంటే సస్పెన్షన్ వేటు తప్పదని హెచ్చరించింది.

అయితే పలు కారణాలవల్ల ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి.చివరిసారిగా ఆగస్టు 12వ తేదీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించగా, దానికి ఒకరోజు ముందు పంజాబ్- హర్యానా హైకోర్ట్ ఎన్నికలపై స్టే విధించింది.

ఈ క్రమంలో భారత రెజ్లింగ్ సమాఖ్య పై సస్పెన్షన్ వేటు పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube