ప్రపంచంలోనే అతి చిన్న స్మార్ట్ ఫోన్ యూని హెర్ట్జ్ జెల్లీ స్టార్( Unihertz Jelly Star ) త్వరలోనే భారత మార్కెట్లోకి అడుగుపెట్టనుంది.చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ యూని హెర్ట్జ్ ప్రపంచంలోనే అతి చిన్న 3 అంగుళాల డిస్ప్లే తో( 3 Inch Display ) కూడిన జెల్లీ స్టార్ స్మార్ట్ ఫోన్ ను ఆవిష్కరించింది.
ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 613 వెర్షన్ తో పనిచేస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్ నథింగ్ ఫోన్ వన్ విత్ ట్రాన్స్పరెంట్ డిజైన్ మాదిరిగానే రేర్ ప్యానల్ మీద ఎల్ఈడి నోటిఫికేషన్ ఇస్తుంది.
ట్రాన్స్పరెంట్ బ్యాక్ ప్యానెల్ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ ఇంటర్నల్ విడి విభాగాలు సైతం కనిపిస్తాయి.
ఇక ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే జెల్లీ స్టార్ ఫోన్( Jelly Star Smart Phone ) మూడు అంగుళాల డిస్ప్లేతో ఉంటుంది.480*854 పిక్సెల్ రిజల్యూషన్ కలిగి ఉంటుంది.ఈ స్మార్ట్ ఫోన్ మీడియా టెక్ హెలియో జీ-99 ఒక్టా కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది.
అంతే కాకుండా 48 మెగా పిక్సెల్ ప్రైమరీ లెన్స్ సింగిల్ కెమెరా తో ఉంటుంది.వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సల్ కెమెరాతో వస్తుంది.
ఇక బ్యాటరీ విషయానికి వస్తే 2000 ఎంఎహెచ్ కెపాసిటీ కలిగిన బ్యాటరీతో వస్తుంది.ఈ బ్యాటరీ ని ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే రోజంతా ఉపయోగించుకోవచ్చు.ఇందులో 8GB RAM+ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది.ఇంకా అదనంగా కావాలంటే మైక్రో ఎస్డి కార్డ్ తో స్టోరేజ్ ను పొడిగించుకోవచ్చు.
చైనా ఈ అతి చిన్న స్మార్ట్ ఫోన్ ను హాంకాంగ్ మార్కెట్లో విడుదల చేసింది.భారత కరెన్సీ ప్రకారం దీని ధర రూ.17000 మాత్రమే.ఇక భారత మార్కెట్లోకి అక్టోబర్ నెలలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమచారం.