సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్స్ ఎప్పుడూ ఇండస్ట్రీలో కొనసాగలేరు.సమయం దగ్గరికి వస్తే వాళ్ళు హీరోయిన్ కెరీర్ కి ముగింపు పలకాల్సిందే.
ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలు మాత్రమే చేసుకుంటూ పోవాలి.అలా ఇప్పటికీ చాలామంది హీరోయిన్లు కొంతకాలం హీరోయిన్లుగా చేసి ఆ తర్వాత తల్లి పాత్రలో చేసి.
ఇప్పుడు అమ్మమ్మ పాత్రలో కూడా చేస్తున్నారు.అయితే త్వరలో తమన్నా,( Tamanna ) సమంతల ( Samantha ) సమయం కూడా ముగియడానికి వచ్చిందని అర్థం అవుతుంది.
ఆ మధ్య వీరిద్దరు టాలీవుడ్ ఇండస్ట్రీని బాగా షేక్ చేశారు.అప్పట్లో స్టార్ హీరోలందరూ తమన్నాను, సమంతలను మాత్రమే ఎంచుకునే వాళ్ళు.ముఖ్యంగా స్టార్ హీరోలు తాము చేసే సినిమాలలో కచ్చితంగా ఈ హీరోయిన్స్ ఉండేటట్టు చూసుకునే వాళ్ళు.కానీ ఇప్పుడు హీరోయిన్స్ గా వీరి కెరీర్ ముగియడానికి టైం దగ్గర పడిందని అర్థమవుతుంది.
పైగా గత రెండు మూడు ఏళ్ల నుండి వీరిద్దరూ సరైన హిట్ కూడా కొట్టలేకపోతున్నారు.ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా వరుసగా ప్లాప్స్ అందుకుంటున్నారు.పైగా స్టార్ హీరోలు కూడా వీరికి అంతగా అవకాశం ఇవ్వటం లేదు.దాంతో చిన్న చిన్న హీరోలతో మాత్రమే సరిపెట్టుకుంటున్నారు.
అయితే వీరిద్దరి టైం దగ్గర పడటానికి ఒక కుర్ర హీరోయిన్ కారణమని తెలుస్తుంది.

ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో కాదు శ్రీ లీల.( Sreeleela ) చేసిన రెండు సినిమాలకే ఇప్పుడు స్టార్ హీరోలు ఈ అమ్మడిపై మనసు పారేసుకున్నారు.కారణం ఈ ముద్దుగుమ్మలో యాక్టింగ్ స్కిల్స్ తో పాటు, అందం, టాలెంట్ కూడా ఉంది.
దీంతో ఇప్పుడున్న స్టార్ హీరోలంతా మొదట ఈ ముద్దుగుమ్మనే ఎంచుకుంటున్నారు.కేవలం చిన్న హీరో అయిన రోషన్ తో పెళ్లి సందD సినిమాలో చేయగా ఆ తర్వాత.
స్టార్ హీరో రవితేజతో ధమాకాలో నటించింది.

ఈ సినిమా ఈ అమ్మడి తలరాత మొత్తం మార్చేసింది.దీంతో ఇప్పుడు దర్శకులంతా ఈ ముద్దుగుమ్మ కోసం క్యూ కట్టారు.ప్రస్తుతం శ్రీ లీల బాలయ్య, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్, విజయ్ దేవరకొండ, వైష్ణవ్ తేజ్ ఇంక మరి కొంతమంది స్టార్ హీరోలతో కలిపి దాదాపై పది కి పైగా సినిమాలు చేస్తుంది.
అయితే ఈ సినిమాలు దగ్గర పడుతున్న సందర్భంగా.మరింత బిజీ అవ్వటానికి సెకండ్ హీరోయిన్ గానే కాకుండా స్పెషల్ సాంగులల్లో కూడా చేయడానికి సిద్ధమైందని తెలిసింది.

ఇప్పుడు ఏ దర్శకుడైన, హీరో అయిన శ్రీ లీలనే పట్టుకోవడంతో తమన్నా, సమంతలకు కుళ్ళు లేస్తుందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.పైగా వీరిద్దరి చేతిలో కూడా అన్ని సినిమాలు లేకపోవడంతో.వీరి టైం దగ్గర పడింది అని.త్వరలో హీరోయిన్ గా వీరిద్దరూ ముగింపు పలకటం ఖాయమని.ఇప్పుడు శ్రీ లీల క్రేజ్ నడుస్తుంది అని.అందుకే వీరిద్దరూ ఇప్పుడు సైలెంట్ గా కనిపిస్తున్నారు అని అంటున్నారు.