సోషల్ మీడియా వచ్చాక ప్రతిరోజు ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటూ ఆశ్చర్యానికి గురి అవుతున్నాం.ఎంతోమంది వ్యక్తులు సోషల్ మీడియా ద్వారా తమ ప్రతిభను బయట ప్రపంచానికి చూపిస్తూ ఫేమస్ అవుతున్నారు.
మనమందరం అల్లం టీ, లెమన్ టీ గురించి వినే ఉంటాం.కానీ ఎప్పుడైనా బిర్యానీ టీ,( Biryani Tea ) రసగుల్లా టీ , ( Rasgulla Tea ) ఎగ్ టీ, చిల్లీ టీ లాంటివి త్రాగారా.
కనీసం ఈ టీల పేర్లు ఎప్పుడైనా విన్నారా.? ఒక రెస్టారెంట్ లో ఈ అన్ని రకాల టీ వెరైటీలు లభిస్తాయి.ఆ రెస్టారెంట్ కు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.
పశ్చిమబెంగాల్ లోని( West Bengal ) బెల్గారియాలోని రైల్వే స్టేషన్ లో సుమారుగా 17 సంవత్సరాల నుంచి ఆకాష్ సాహా ఓ టీ రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు.
మొదట్లో ఇక్కడ మిల్క్ టీ, ఆల్కహాల్ టీ లతోపాటు టీ, లెమన్ టీ లాంటివి దొరికేవి.

లాక్ డౌన్ తర్వాత బిజినెస్ అనుకున్నా రీతిలో జరగకపోవడంతో ఆకాష్ సాహా ఏదైనా కొత్తగా ప్రయత్నించాలని అనుకున్నాడు.ఇక సరికొత్తగా ఆలోచించి ఎగ్ టీ, బిర్యానీ టీ, రసగుల్లా టీ, చాక్లెట్ టీ, చిల్లీ టీ, హాట్ కాఫీ, కోల్డ్ కాఫీ లాంటి ప్రత్యేకమైన టీలను తయారు చేయడం ప్రారంభించాడు.
ఇక టీ ధరలు కూడా అందుబాటు ధరలోనే రూ.5 నుంచి రూ.60 లోపు అందుబాటులో ఉన్నాయి.ప్రేమికుల రోజు వచ్చిందంటే రసగుల్లా టీ కోసం యువత ఎగబడతారు.ఇక పచ్చిమిరపకాయల తో చేసిన చిల్లీ టీ రూ.20 మాత్రమే.ఎగ్ టీ రూ.20 నుంచి రూ.50 రూపాయల లోపు ఉంటుంది.

పచ్చి గుడ్లను వేడిపాల టీలో గిలక్కోట్టి చాలా టేస్ట్ గా తయారు చేస్తారు.అసలు ఆ టీ లో గుడ్డు ఉందని కూడా ఎవరు గుర్తించలేరని ఆకాశ్ సాహా తెలిపాడు.
ఈ రెస్టారెంట్ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు తెరచి ఉంటుంది.ఇక రోజంతా యువతీ యువకులతో ఈ రెస్టారెంట్ చాలా రద్దీగా ఉంటుందట.
రకరకాల టీలు లభించే ఈ రెస్టారెంట్ సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.