ఎవరి పిచ్చి వారిదన్నట్టు, మనిషికో అలవాటు ఉంటుంది.దాన్ని ఎంత ట్రై చేసినా మానుకోలేరు.
కొందరు మద్యానికి బానిసైతే, మరికొందరు కొన్ని రకాల తిండి పదార్ధాలకు అడిక్ట్ అవుతారు.ఇంకొంతమంది సిగరేట్ తాగుతుంటారు.
వేరొకరు గాంజాయి తాగుతుంటారు.మరికొంతమందైతే డ్రగ్స్ కి బానిస అయిపోతారు.
అయితే, ఏదైన ఒక అలవాటు పరిధి వరకు ఉంటే ఇబ్బంది లేదు గాని పరిధి దాటితే మాత్రం ఇబ్బందులకు గురి అవ్వక తప్పదు.సరిగ్గా ఇలాంటి సంఘటనే ఇక్కడ జరిగింది.
ఒక వ్యక్తికి వింతైన అలవాటు అయ్యింది.
వివరాల్లోకి వెళితే, UKకు చెందిన ఆంటీ క్యూరీ అనే వ్యక్తికి పెప్సీ అంటే పిచ్చి.
ఎంతలా అంటే, అతను తాగటానికి నీళ్లు లేకుండా అయినా ఉండగలడేమో కానీ పెప్సీ లేకుండా మాత్రం బతకలేడు అన్న మాదిరి అతగాడికి పెప్సీ అలవాటు అయింది.కాలక్రమేణా దానికి అతడు బానిసలాగా మారాడు.
అతను గత 20 ఏళ్ల నుంచి, ప్రతి రోజు 30 క్యాన్ల పెప్సీని అమాంతం తాగేస్తాడు.అతను కొన్ని సందర్భరాలలో నీళ్లకు బదులు, పెప్సీని మాత్రమే తాగుతుండేవాడు.
ఈ క్రమంలో కొన్ని రోజులకు అతనిలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తాయి.దీంతో.
అతను హిప్నోథేరపీ తీసుకున్నాడు.
ఆ తర్వాత కాలంలో క్రమ క్రమంగా తన అలవాటును తగ్గించుకున్నాడు.
ప్రస్తుతం అతగాడు ఓ సాధారణ మనిషి ఏ మాదిరిగా పెప్సీని తాగుతాడో అదే స్థాయికి మన ఆంటీ క్యూరీ వచ్చేసాడు.గతంలో తన అలవాటు గురించి మిస్టర్ క్యూరీ సోషల్ మీడియా వేదికగా పంచుకొవడంతో ఈ ఘటన కాస్త వైరల్ అయింది.సో దీన్ని బట్టి మీకు ఏమి అర్ధమౌతుంది? ‘అతి సర్వత్రా వర్జయేత్’ అన్నాడు కృష్ణ భగవానుడు.అది అక్షరాలా నిజమని ఈ కాదని వింటే మీకు బోధపడుతుంది కదా.అందుకే ఏ అలవాటన్నా మితంగా ఉంటే ఆరోగ్యం, అమితంగా ఉంటే అనారోగ్యం అని గుర్తుంచుకోండి మిత్రులారా!
.