తెలుగు చిత్ర పరిశ్రమ రానున్న రోజుల్లో ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కోబోతుందా అంటే ప్రస్తుతం వినిపిస్తున్న మాట మాత్రం అవును అనే.ఇటీవలి కాలంలో జరుగుతున్న పరిణామాలు తెలుగు చిత్ర పరిశ్రమను తీవ్రమైన సంక్షోభంలోకి నెడుతున్నాయి అని అర్థమవుతుంది.
పైకి పాన్ ఇండియా స్థాయి సినిమాలను తెరకెక్కిస్తామని చెప్పుకుంటున్నా.ఇక ఇండస్ట్రీలో సమస్యలు మొదలు కావడానికి ఎన్నో రోజుల సమయం లేదు అన్నది అర్ధమవుతుంది.
దీనికి కారణం టికెట్ రేట్లు భారీగా పెంచడమే.
టికెట్ రేట్లు భారీగా పెంచిన నేపథ్యంలో ప్రేక్షకుడు థియేటర్కు రావాలంటేనే భయపడి పోతున్నాడు.ఓటిటి కీ ప్రియారిటి ఇస్తూ హాయిగా ఇంట్లో కూర్చుని సినిమా చూడాలని అనుకుంటున్నాడు.100 కోట్లు పెట్టి సినిమా తీస్తున్న నిర్మాతలకు నష్టాలను తప్పడంలేదు.ఇటీవల నాని హీరోగా వచ్చిన అంటే సుందరానికి సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకున్న 40శాతం కష్టాలు తప్పేలా లేవు అన్నది తెలుస్తుంది విశ్వక్సేన్ అశోకవనంలో అర్జున కళ్యాణం హిట్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్ల మాత్రం కనిపించడం లేదు.

అయితే కరోనా నష్టాన్ని పూడ్చుకునేందుకు ప్రభుత్వంతో పోరాటం చేసి మరీ టికెట్ రేట్లను పెంచేలా చేశారు ఇండస్ట్రీ పెద్దలు.కానీ ఇప్పుడిప్పుడే ఈ విషయంపై నిర్మాతలు కళ్ళు తెరుచుకుంటున్నాయి అన్నది తెలుస్తుంది.మొన్నటి వరకు టికెట్ చార్జీలను పెంచాలని డిమాండ్ చేసిన నిర్మాతలు తమ సినిమాకు టికెట్ రేట్లు పెంచటం లేదు అంటు విడుదలకు ముందే ప్రకటనలు చేస్తున్నారు.
అయితే ఇక్కడ రెట్లు తక్కువగా ఉన్నప్పుడు విడుదలైన అఖండ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని సాధించి లాభాలను తెచ్చిపెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.దీంతో ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలతో రానున్న రోజుల్లో చిత్ర పరిశ్రమ సంక్షోభంలో పడిపోవటం ఖాయమని మల్టీప్లెక్స్ లు పెద్ద థియేటర్లు మూసుకోవడం పక్క అంటూ కొంత మంది సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.







