తెలంగాణ రాష్ట్రంలో మరో 60 రోజుల్లో లోక్ సభ ఎన్నికలు( Lok Sabha Elections ) జరగబోతున్నాయి.గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది.
ఈ క్రమంలో ఆల్రెడీ ప్రచారం కూడా స్టార్ట్ చేయడం జరిగింది.దీనిలో భాగంగా ఇంద్రవెల్లిలో సభ కూడా నిర్వహించారు.
ఇదిలా ఉంటే తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి( Congress Senior Leader Jagga Reddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు.పాలనపరంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు ఏనాడు సచివాలయానికి రాలేదని కేవలం వారు ఇళ్లల్లో నుంచే పరిపాలన కొనసాగించారని విమర్శించారు.బుధవారం గాంధీభవన్( Gandhi Bhavan ) లో నిర్వహించిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు.
ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్ అదే విధంగా మాజీ సీఎం కేసీఆర్( Former CM KCR ) లపై మండి పడటం జరిగింది.ఆ ఇద్దరు నాయకులు బీజేపీ ఆదేశాలతోనే పనిచేస్తున్నట్లు ఆరోపించారు.తెలంగాణ అభివృద్ధి చెందొద్దని కేసీఆర్, జగన్ కుట్రలకు పాల్పడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Government ) ఎక్కువ కాలం ఉండదని వ్యాపారవేత్తలను అయోమయానికి గురి చేస్తున్నట్లు మండిపడ్డారు.
ఎమ్మెల్యేలను నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ నాయకులు డ్రామాలాడుతున్నారు.ఆ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.
పార్లమెంట్ ఎన్నికలలోపు ఈ 20 మందిని కాంగ్రెస్ పార్టీలోకి లాక్కుందామని సీఎం రేవంత్ రెడ్డికి( CM Revanth Reddy ) చెప్పానని లేట్ చేయొద్దని సూచించినట్లు జగ్గారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.