ఆలియా భట్ ప్రెగ్నెంట్ అయ్యిందని కత్రినా, దీపికపై ట్రోల్స్.. కారణం?

మొన్నటి వరకు హీరోయిన్ లు తమ పర్సనల్ విషయాలు బయట పెట్టడానికి చాలా ఇబ్బంది పడేవారు.చాలా వరకు తమ సీక్రెట్లు బయటపడకుండా బాగా కాపాడుకునే వాళ్ళు.

 Trolls On Katrina And Deepika That Alia Bhatt Is Pregnant Do You Know The Reason , Alia Bhatt , Tollywood , Katrina Kaif, Deepika Padukone,ranbir,bollywood , Pregnant , Trolling , Kajal,katrina ,praneetha, Deepika , Bollywood,relationship Matters, Marriage Matters, Pregnancy Matters-TeluguStop.com

కానీ ఈ మధ్య అలా లేరు.దాచితే ఏమి వస్తుందన్న ఉద్దేశంతో అన్ని విషయాలు బయట పెడుతున్నారు.

తమ రిలేషన్ షిప్ విషయాలు, పెళ్లి విషయాలు, తమ ప్రెగ్నెన్సీ విషయాలు కూడా షేర్ చేసుకుంటున్నారు.

 Trolls On Katrina And Deepika That Alia Bhatt Is Pregnant Do You Know The Reason , Alia Bhatt , Tollywood , Katrina Kaif, Deepika Padukone,Ranbir,bollywood , Pregnant , Trolling , Kajal,katrina ,Praneetha, Deepika , Bollywood,Relationship Matters, Marriage Matters, Pregnancy Matters-ఆలియా భట్ ప్రెగ్నెంట్ అయ్యిందని కత్రినా, దీపికపై ట్రోల్స్.. కారణం-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మొత్తానికి వీటిని సోషల్ మీడియా వేదికతో పంచుకుంటూ బాగా సందడి చేస్తున్నారు.

ఆ మధ్య టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కాజల్ తను ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినప్పటి నుంచి బాబు పుట్టే వరకు బేబీ బంప్ ఫోటోలతో బాగా సందడి చేసింది.ఇక ఇటీవలే మరో హీరోయిన్ ప్రణీత కూడా ప్రెగ్నెన్సీ కావడంతో తన బేబీ బంప్ ఫోటోను కూడా పంచుకుంది.

ఇక తాజాగా నమిత కూడా తన బేబీ బంప్ ఫోటో షేర్ చేసుకొని అందరి దృష్టిలో పడింది.

ఇక ఈ మధ్య బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా తమ పర్సనల్ విషయాలు బయటపెడుతున్నారు.

ఇదివరకైతే అసలే విషయాలు చెప్పకపోయేది.కానీ ఇప్పుడు పర్సనల్ విషయాలన్ని ఇబ్బంది పడకుండా బయటపెడుతున్నారు.

ఇటీవలే అలియా భట్ తను ప్రెగ్నెట్ అయ్యానని సోషల్ మీడియా వేదికగా తెలిపిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈ విషయం బాలీవుడ్ లో మాత్రం బాగా హాట్ టాపిక్ గా మారింది.

బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ హిందీలో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.ఆ మధ్య రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది.

ఇక ఈమె సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.నిత్యం తన ఫోటోలను అభిమానులతో బాగా పంచుకుంటుంది.

ఇక ఈమె బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ తో ఐదు సంవత్సరాలు రిలేషన్షిప్ లో ఉండి ఈ ఏడాది ఏప్రిల్ 14వ తేదీన పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.ఇక పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు కూడా బాగా వైరల్ గా మారాయి.బాలీవుడ్ లో ఈ జంట కూడా క్యూట్ కపుల్ గా నిలిచింది.అంతేకాకుండా ఇద్దరూ పలు ప్రాజెక్టులలో కూడా బాగా అవకాశాలు అందుకున్నారు.

ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ప్రేక్షకులకు, తన అభిమానులకు గుడ్ న్యూస్ వినిపించింది.తల్లి కాబోతున్నానని తెలిపింది.తన స్కానింగ్ ఫోటో కూడా తన ఇన్ స్టా లో పంచుకోగా అది చూసిన నెటిజన్లు, తన అభిమానులు, బాలీవుడ్ ప్రముఖులు కూడా తనకు శుభాకాంక్షలు తెలిపారు.మరోవైపు కొందరు పెళ్లికి ముందే వీరు ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేశారని.

అందుకే అంత త్వరగా పెళ్లి చేసుకున్నారు అని బాగా ప్రచారం చేస్తున్నారు.

ఇక ఇదంతా పక్కన పెడితే అలియా భట్ వల్ల మరో ఇద్దరు హీరోయిన్లను బాగా టార్గెట్ చేశారు నెటిజన్లు.ఇంతకు ఆ హీరోయిన్లు ఎవరో కారు. కత్రినా కైఫ్, దీపిక పదుకొనే.

వీరికి అలియా భట్ కంటే ముందుగానే పెళ్లి జరిగిన కూడా వీరు మాత్రం ఇప్పటివరకు గుడ్ న్యూస్ వినిపించలేదు.దీంతో వీరిద్దరిని బాగా టార్గెట్ చేస్తూ బాగా ట్రోల్ చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube