సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలకు ఒక్కో సినిమాకు కోట్ల రూపాయల స్థాయిలో పారితోషికం ఉంటుంది.ఈ పారితోషికం గురించి వైరల్ అయ్యే వార్తలు కొన్ని సందర్భాల్లో అభిమానులను సైతం షాక్ కు గురి చేస్తుంటాయి.
స్టార్ స్టేటస్ ను అందుకున్న సెలబ్రిటీలు సైతం తక్కువ రెమ్యునరేషన్ కే సినిమాలలో నటించారు.మెగాస్టార్ చిరంజీవి తొలి రెమ్యునరేషన్ కేవలం 1116 రూపాయలు కావడం గమనార్హం.
ప్రస్తుతం చిరంజీవి రెమ్యునరేషన్ 40 కోట్ల రూపాయల నుంచి 50 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటున్న టాలీవుడ్ హీరోలలో ఒకరు.
ఈ టాలెంటెడ్ హీరో ఫస్ట్ రెమ్యునరేషన్ కేవలం 4 లక్షల రూపాయలు కావడం గమనార్హం.ప్రస్తుతం యూత్ లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు.
ఈ హీరో సినిమాల్లో హీరోగా పని చేయకముందు ట్యూషన్లు చెప్పారని బోగట్టా.ఆ సమయంలో విజయ్ కేవలం 500 రూపాయలు తీసుకున్నారని తెలుస్తోంది.ప్రస్తుతం ఒక్కో సినిమాకు 5 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్న సమంత సంపాదన కూడా 500 రూపాయలు అని హోస్ట్ గా పని చేయడంతో ఈ సంపాదన దక్కిందని బోగట్టా.హీరో బన్నీకి చిన్నప్పుడే దర్శకుడు రాఘవేంద్రరావు నుంచి 100 రూపాయలు అడ్వాన్స్ గా దక్కింది.
అప్పుడు 100 రూపాయలు తీసుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం 100 కోట్ల రూపాయలు తీసుకునే స్థాయికి ఎదిగారు.టాలీవుడ్ స్టార్స్ కు సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా ఈ హీరోల, హీరోయిన్ల పారితోషికాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.టాలీవుడ్ స్టార్ హీరోలలో చాలామంది హీరోలకు ఇప్పటికే పాన్ ఇండియా స్టేటస్ దక్కగా మరి కొందరు హీరోలకు త్వరలో పాన్ ఇండియా స్టేటస్ దక్కే అవకాశాలు అయితే ఉన్నాయి.