క్యాలీఫ్లవర్ పంట( Cauliflower )ను చల్లని తేమతో కూడిన వాతావరణంలో సాగు చేస్తే ఆశించిన స్థాయిలో మంచి దిగుబడులు సాధించవచ్చు.ఈ పంట సాగులో మెళుకువలు పాటిస్తూ, ఒకేసారి కాకుండా విడతల వారీగా సాగు చేయడం వల్ల రైతులు మంచి ఆదాయం అర్జించవచ్చు.
ఈ పంట సాగుకు నల్లరేగడి నేలలు( Back Soil ), ఎర్ర నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి.నేల యొక్క పీహెచ్ విలువ 5.5-6.5 ఉండే నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి.వేసవికాలంలో లోతు దుక్కులు దున్నుకోని, ఆఖరి దుక్కిలో ఒక ఎకరం పొలంలో ఎనిమిది టన్నుల పశువుల ఎరువు, 40 కిలోల పొటాష్, 40 కిలోల భాస్వరం ఎరువులను వేసి పొలాన్ని కలియ దున్నుకోవాలి.ఒక ఎకరం పొలానికి 300 గ్రాముల విత్తనాలు అవసరం.
ఒక కిలో విత్తనాలను మూడు గ్రాముల తైరంతో విత్తన శుద్ధి చేసుకోవాలి.
నారు పెంచేందుకు 15 సెంటీమీటర్ల ఎత్తు ఉండే నారుమడులను ఏర్పాటు చేయాలి.మడులపై సమానంగా గీతలు గీసుకొని, విత్తనాలు విత్తి మెత్తటి మట్టితో కప్పేయాలి.ఆ తర్వాత పలుచగా వరిగడ్డిని పరిచి తేలికపాటి నీటి తడి అందించాలి.నారుకు ఆకు తినే పురుగులు ఆశించే అవకాశం చాలా ఎక్కువ కాబట్టి ఒక లీటరు నీటిలో 2.5 మిల్లీలీటర్ల మాలాథియాన్ ను కలిపి పిచికారి చేయాలి.ప్రధాన పొలంలో నాటేందుకు 25 రోజుల వయసు ఉండే ఆరోగ్యకరమైన తెగులు నిరోధక నారును ఎంపిక చేసుకోవాలి.ఒక ఎకరం పొలానికి 15 మొక్కలు అవసరం.మొక్కల మధ్య 45 సెంటీమీటర్ల దూరం మొక్కల వరుసల మధ్య 60 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు నాటుకోవాలి.దీంతో మొక్కలకు సూర్యరశ్మితో పాటు గాలి బాగా తగిలి చాలా ఆరోగ్యకరంగా పెరుగుతాయి.
తేలికపాటి ఎర్ర నేలలలో( Red Soil ) సాగు చేస్తే ఏడు రోజులకు ఒకసారి, నల్ల రేగడి నెలలలో సాగు చేస్తే పది రోజులకు ఒకసారి నీటి తడులు అందిస్తూ పొలంలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్రధాన పొలంలో నారు నాటిన 24 గంటల తర్వాత ఒక ఎకరం పొలానికి 1.25 లీటర్ల పెండిమిథాలిన్ ను ఒక లీటరు నీటిలో కలిపి తేమ ఉంటే నేలపై చల్లుకోవాలి.నారు మొక్కలపై ఈ రసాయనం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
నాణ్యమైన పువ్వు పొందాలంటే కూతకు ముందు ఏడు రోజుల నుంచే మొక్క యొక్క ఆకులతో పువ్వులు కప్పి వేయాలి.దీంతో పువ్వు తెల్లగా మచ్చలు( White Scars ) లేకుండా నాణ్యంగా ఉంటుంది.