వైరల్: 2027లో యుగాంతం రాబోతుందా... విషయం ఏమిటి?

2012 యుగాంతం గురించి ప్రజలు అంత త్వరగా మర్చిపోరు.అది యే రేంజులో జరిగిందో అందరికీ తెలిసినదే.

 Time Traveler Claims He Is Only Person Left In 2027 Details, Viral, End Of Era,-TeluguStop.com

ఆ పుకారుని కొందరు తెలివైనవారు సినిమాలుగా మలిచి బాగా సొమ్ము కూడా చేసుకున్నారు.ఈ క్రమంలో కొంతమంది వ్యక్తులు విపత్తు సమయంలో తలదాచుకొనేలా బంకర్లను కూడా నిర్మించుకున్నారు.

తరువాత ఈ వార్త కేవలం పుకారు మాత్రమే అని నిరూపించబడింది.అయితే ప్రపంచం అంతం గురించి అనేక వాదనలు చేసేవారు ఇప్పటికీ ఉన్నారు.

ప్రస్తుతం అలాంటి వ్యక్తి చేసిన వాదన ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Telugu Bunkers, Dooms Day, Era, Time Traveler, Timetraveler-General-Telugu

అవును, సరిగ్గా అంటే 4 ఏళ్ల తర్వాత అంటే 2027లో ప్రపంచంలో తాను తప్ప మరెవరూ మిగలరని ఓ వ్యక్తి పేర్కొన్నాడు.వాస్తవానికి వ్యక్తి తనను తాను టైమ్ ట్రావెలర్‌గా( Time Traveller ) కూడా చెప్పుకొని తిరుగుతున్నాడు మరి.అతను భవిష్యత్తుకి వెళ్లి.అక్కడ నుంచి తిరిగి వచ్చానని చెబుతున్నాడు.మిర్రర్ నివేదిక ప్రకారం.వ్యక్తి 2027లో ప్రపంచం ఎలా ఉంటుందో చూసిన తర్వాత తిరిగి వచ్చానని చెప్పాడు.అతను 2027 లోకి వెళ్ళినప్పుడు భూమిపై( Earth ) మనుషులు లేరని, ఎక్కడ చూసినా పెద్ద పెద్ద భవనాలు మాత్రమే కనిపించాయని చెప్పుకొచ్చాడు.

Telugu Bunkers, Dooms Day, Era, Time Traveler, Timetraveler-General-Telugu

అంతేకాకుండా, ప్రపంచ ప్రసిద్ధి చెందిన కొలోస్సియంను కూడా చూసినట్లు అక్కడ ఒక్క మానవుడు కూడా కనిపించలేదని పేర్కొన్నాడు.నివేదికల ప్రకారం చూస్తే ఆ వ్యక్తి పేరు జేవియర్.( Javier ) తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల్లో అనేక వీడియోలు, చిత్రాలను కూడా ఈ సందర్బంగా విడుదల చేశాడు.ఈ నేపధ్యంలోనే 2027లో భూమిపై మిగిలి ఉన్న ఏకైక మానవుడు తానేనని ఆయన పేర్కొన్నారు.

అతను షేర్ చేసిన వీడియోలో మొత్తం నగరం చిత్రాన్ని చూపించాడు.మొత్తం నగరం పూర్తిగా ఖాళీగా ఉంది.కార్లు, ఎత్తైన భవనాలు ఉన్నాయి, కానీ మనుషులు( Human Beings ) లేరు.మనుష్యులందరూ అదృశ్యమైనట్లు కనిపించింది.

తాను 2027 లో రోమ్ వీధుల్లో పగటిపూట తిరుగుతున్నానని, వీధులు పూర్తిగా ఖాళీగా కనిపించాయని జేవియర్ చెప్పాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube