కర్నాటక లీడర్స్ ఎంట్రీ.. కాంగ్రెస్ కు ముప్పే ?

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ( Congress party )యమ దూకుడు మీద ఉంది.ఎన్నికల వేళ ఆ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా అనుకూల పవనాలు వీస్తుండడంతో ఎన్నికల ముందే విజయం సాధించినంతగా ఆ పార్టీనేతలు ఆనందంలో మునిగి తేలుతున్నారు.

 Threat To Congress With Karnataka Leaders, Dk Shivakumar , Karnataka Leaders ,-TeluguStop.com

అధికార బి‌ఆర్‌ఎస్ ను ఇరకాటంలో పెట్టేలా ప్రకటనలు చేయడం, ప్రచారాలు నిర్వహించడం, కాంగ్రెస్ దే విజయం అనే భావనాను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడం.వంటి విషయాల్లో ఆ పార్టీ కొంత మేర విజయం సాధించిందనే చెప్పాలి.

కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, గడిచిన తొమ్మిదేళ్ల కే‌సి‌ఆర్ పాలనలో ఎలాంటి ఉద్యోగ రూపకల్పన జరగలేదని, కే‌సి‌ఆర్ కుటుంబం వేళ కోట్ల అవినీతికి పాల్పడిందని ఈ రకమైన విమర్శలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ గులాబీ బాస్ ను డిఫెన్స్ లోకి నేట్టింది కాంగ్రెస్ పార్టీ.

Telugu Cm Kcr, Congress, Dk Shivakumar, Farmers, Kaleshwaram, Karnataka, Revanth

అయితే కాంగ్రెస్ లోపాలను ఎత్తి చూపిస్తూ బి‌ఆర్‌ఎస్ నేతలు కూడా హస్తం పార్టీ గట్టిగానే ఇరకాటంలో పెడుతున్నారు.ఆరు గ్యారెంటీలు ఒట్టి బోగట్ట, కర్నాటకలో ఇవే హామీలు ప్రకటించిన కాంగ్రెస్ అక్కడ అమలు చేయడంలో విఫలం అయిందని, అక్కడ 5 గంటలే కరెంట్ ఇస్తునట్లు స్వయంగా ఆ పార్టీ నేతలే ఒప్పుకుంటున్నారని.బి‌ఆర్‌ఎస్ నేతలు గట్టిగానే ప్రచారం చేస్తున్నారు.

ముఖ్యంగా కరెంట్ విషయంలో కాంగ్రెస్ ను డిఫెన్స్ లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు బి‌ఆర్‌ఎస్ నేతలు, కాంగ్రెస్ కావాలా ? కరెంట్ కావాలా ? కాంగ్రెస్ వస్తే కరెంట్ కోతలు తప్పవని కే‌సి‌ఆర్( CM KCR ) అందుకున్న నినాదం ప్రజల్లోకి గట్టిగానే వెళుతోంది.ఈ నేపథ్యంలో కర్నాటక లీడర్లను కాంగ్రెస్ మళ్ళీ తెలంగాణలో ప్రచారానికి తీసుకోచ్చేందుకు ప్రయత్నిస్తుండడంతో పార్టీ కి కొంత ప్రతికూలంగా మారుతుందనేది కొందరి అభిప్రాయం.

Telugu Cm Kcr, Congress, Dk Shivakumar, Farmers, Kaleshwaram, Karnataka, Revanth

ఎందుకంటే ఆ మద్య తెలంగాణ ప్రచారంలో పాల్గొన కర్నాటక డిప్యూటీ సి‌ఎం డీకే శివకుమార్( DK Shivakumar ).తెలంగాణలో 24 గంటల కరెంట్ వస్తుంటే కర్నాటకలో 5 గంటలే కరెంట్ అమలౌతోందని స్వయంగా ఆయనే ఒప్పుకోవడం హస్తం పార్టీకి భారీగా డ్యామేజ్ తీసుకొచ్చింది.ఇప్పుడు ఆయన మళ్ళీ తెలంగాణలో ప్రచారానికి మళ్ళీ వస్తే కర్ణాటకలోని మరిన్ని లోపాలను బయటపెడితే హస్తంపార్టీకి తిప్పలు తప్పవని రాజకీయ వాదులు చెబుతున్నారు.ఇప్పటికే కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలు విషయంలో ఘోరంగా విఫలం అయిందని బి‌ఆర్‌ఎస్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది, ఈ నేపథ్యంలో ఏ మాత్రం నోరు జారిన హస్తం పార్టీ ఇమేజ్ గాల్లో కలిసిపోవడం గ్యారెంటీ అనేది కొందరి అభిప్రాయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube