ప్రతిపక్షాలతో పోలిస్తే ఆ విషయంలో వెనుకబడ్డ టీఆర్ ఎస్ పార్టీ

ఒకప్పుడు మీడియా రాజకీయాలలో కీలక పాత్ర పోషించేది.కాని సోషల్ మీడియా శకం మొదలైన తరువాత మీడియా పాత్ర తక్కువైపోయి సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోంది.

 The Trs Party Is Lagging Behind In That Regard As Compared To The Opposition Bjp-TeluguStop.com

ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 9 నుండి 10 గంటలు సోషల్ మీడియాలోనే గడుపుతున్న పరిస్థితి ఉంది.అందుకే రాజకీయ పార్టీలు కూడా సోషల్ మీడియా వేదికగా చాలా చురుకుగా ఉంటూ పరిస్థితులను తమకు అవకాశంగా మలుచుకుంటున్నారు.

సోషల్ మీడియా ప్రభంజనం సృష్టించి పార్టీలు అధికారంలోకి వచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి.

ఇక అసలు విషయంలోకి వస్తే తెలంగాణలో సోషల్ మీడియా వేదికగా యాక్టివ్ గా ఉన్న పార్టీ ఏదైనా ఉంటే అది బీజేపీ అని చెప్పక తప్పదు.

అలాగే కాంగ్రెస్ కూడా ఎంతో కొంత సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.కాని ఇటు బీజేపీ, కాంగ్రెస్ లతో పోలిస్తే టీఆర్ఎస్ సోషల్ మీడియాలో కాస్త వెనుకబడ్డదని చెప్పవచ్చు.

ఏకంగా అధికారంలోకి ఎవరూ రావాలో నిర్ణయించే శక్తి సోషల్ మీడియాకు ఉన్న ప్రస్తుత తరుణంలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ ప్రతిపక్షాలతో పోలిస్తే కాస్త వెనుకబడటం భవిష్యత్తులో టీఆర్ఎస్ కు సంకటంగా మారే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube