బైక్‌ స్పీడోమీటర్‌లో దూరిన పాము.. తర్వాత ఏమైందంటే

పాములు విషపూరితమైనవని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.అవి చెట్లు, పుట్టలలోనే కాకుండా ఒక్కోసారి ఇళ్లల్లోకి దూరుతుంటాయి.

 The Snake Got Stuck In The Bike Speedometer What Happened Next , Bike, Speedo Me-TeluguStop.com

చెప్పుల స్టాండ్లలోనో, బూట్లలోనూ నక్కి ఉంటాయి.ఏ మాత్రం ఏమరుపాటుగా వ్యవహరించినా కాటేసి ప్రాణాలు తీస్తాయి.

కాబట్టి వర్షాకాలం, చలికాలం కాస్త అప్రమత్తంగా ఉండడం అత్యవసరం.ఇళ్లలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

చుట్టూ చెట్లు వంటివి ఉన్నప్పుడు పాములు ఇంట్లోకి వచ్చే ప్రమాదం ఉంది.కప్పలు వంటి వాటిని వేటాడుతూ పాములు ఇళ్లలో దూరుతాయి.

ఇటీవల తెలంగాణలో ఓ ఇంట్లోకి పాము దూరగా, దానిని బయటకు రప్పించేందుకు ఓ వ్యక్తి పొగబెట్టాడు.తీరా మంటలు ఇల్లంతా అంటుకుని కాలిపోయింది.

కొన్ని సందర్భాల్లో బైకులలోకి కూడా పాములు దూరి రెస్ట్ తీసుకుంటున్నాయి.తాజాగా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది.

దానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

మధ్యప్రదేశ్‌లోని నార్సింగ్‌పూర్‌లో నజీర్‌ఖాన్ ఇటీవల రెండు రోజుల క్రితం తన బైక్ ను ఎప్పటిలాగే రాత్రి ఇంటి బయట పార్క్ చేశాడు.

తర్వాత రోజు ఉదయాన్నే ఏదో పని మీద బైక్‌పై బయటకు బయల్దేరాడు.మార్గమధ్యంలో అతడికి ఏదో తేడాగా అనిపించింది.అనుమానంతో బైక్ స్పీడోమీటర్ చూడగానే షాక్ అయ్యాడు.జాగ్రత్తగా చూసే సరికి బైక్ స్పీడోమీటర్ గ్లాసులో నల్లటి తాచు పాము కనిపించింది.

వెంటనే బైక్ రోడ్డుపై ఆపేసి పక్కకు వెళ్లిపోయాడు.స్థానికులకు ఈ విషయం చెప్పగానే ఈ వింత సంఘటనను చూసేందుకు చాలా మంది గ్రామస్థులు అక్కడకు చేరుకున్నారు.

వారిలో కొందరు పామును మోటారు సైకిల్‌లో నుంచి బయటకు తీసేందుకు కూడా ప్రయత్నించారు.కొందరు బైక్‌లోని మీటర్ గ్లాస్‌ను పగలగొట్టి, చాలా గంటలపాటు శ్రమించి పామును నెమ్మదిగా బయటకు తీశారు.

ఆ తర్వాత దానిని నిర్మానుష్య ప్రదేశంలో విడిచి పెట్టారు.దీంతో ముప్పు తప్పిందని నజీర్ ఖాన్ ఊపిరి పీల్చుకున్నాడు.

ఏ మాత్రం బైక్ నడుపుతున్నప్పుడు తనను కాటేసి ఉంటే ప్రాణం పోయేదని అతడు పేర్కొన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube