ఇథియోపియన్ రన్నర్ టిగ్స్ట్ అసెఫా 2023, సెప్టెంబర్ 24న ఉమెన్స్ మారథాన్లో( Women’s Marathon ) ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది.ఆమె రన్నింగ్ సమయంలో అడిడాస్ కంపెనీ ఇటీవల లాంచ్ చేసిన సింగిల్ యూజ్ మారథాన్ షూలను ధరించింది.వాటి ధర అక్షరాలా £400 (దాదాపు రూ.40 వేలు).బెర్లిన్ మారథాన్లో అస్సెఫా( Assefa ) రికార్డును క్రియేట్ చేశాక ఆ షూలను ముద్దాడింది.అడిడాస్ తీసుకొచ్చిన ఆ బూట్ల పేరు “అడిజెరో అడియోస్ ప్రో ఈవో 1”.
ఇది అడిడాస్ ఇప్పటివరకు తయారు చేసిన అత్యంత తేలికైన రన్నింగ్ షూ.ఒక షూ కేవలం 138 గ్రాముల బరువు ఉంటుంది, ఇది ఇతర అడిడాస్ షూ కంటే 40% తక్కువ బరువు ఉంటుంది.
బెర్లిన్ మారథాన్లో టాప్ రన్నర్లుగా టిగ్స్ట్ అసెఫా, ఎలియడ్ కిప్చోగ్ నిలవగా, వారు ఇద్దరూ అడిజెరో అడియోస్ ప్రో ఈవో 1ని ధరించారు.ఆ షూ తాను ధరించిన అత్యంత తేలికైన రేసింగ్ షూ అని, అది ధరించి పరిగెత్తడం చాలా అద్భుతంగా ఉందని అసెఫా చెప్పింది.అడిడాస్ అడిజెరో అడియోస్ ప్రో ఈవో 1 రన్నింగ్ షూస్ తనను రేసుపై దృష్టి పెట్టడానికి వీలు కల్పించాయని, ఆ బూట్లతో తన బెర్లిన్ మారథాన్ టైటిల్ను కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు టిగ్స్ట్ అసెఫా చెప్పింది.
అడిడాస్ కంపెనీ ఇన్సోల్ను( Adidas company insole ) తీసివేసి, కీలకమైన ప్రాంతాల్లో లిక్విడ్ రబ్బరుతో చాలా సన్నని ఔట్సోల్ను ఉపయోగించడం ద్వారా షూలను తేలికగా చేసింది.షూలో లైట్స్ట్రైక్ ప్రో ఫోమ్ యొక్క కొత్త వెర్షన్, షూ 60% పొడవులో ప్రత్యేకమైన రాకర్ను కూడా ఉపయోగించారు.ఇతర అడిడాస్ రేసింగ్ సూపర్ షూ కంటే 40% తేలికైన బూట్లు.
అవి ఈరోజు సెప్టెంబర్ 26న అడిడాస్ యాప్లో మళ్లీ విడుదల అవుతాయి.నవంబర్లో మరో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.