బుల్లితెరపై హాట్ యాంకర్ గా వెండితెరపై నటిగా మంచి క్రేజ్ సంపాదించుకున్న అనసూయ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో( Jabardasth Show ) ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన అనసూయ.
అంతకుముందే వెండితెరపై పలు సినిమాలలో నటించింది.కానీ అంత సక్సెస్ అందుకోలేకపోయింది.
ఇక జబర్దస్త్ లో అడుగుపెట్టాక బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో ఓ రేంజ్ లో ఆకట్టుకుంది అనసూయ( Anasuya ).దాంతో ఆ తర్వాత ఈ వెండితెరపై వరుస అవకాశాలు వచ్చాయి.పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లో కూడా నటించింది.
ఇక పాన్ ఇండియా మూవీ పుష్పలో నెగటివ్ రోల్ తో బాగా ఆకట్టుకుంది.ఇక పుష్ప 2 లో కూడా అనసూయ పాత్ర కి మరింత క్రేజ్ ఉంటుందని తెలిసింది.
పలు వెబ్ సిరీస్( Web series ) లు కూడా చేసింది.గతంలో జబర్దస్త్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంది.ఈమెకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఈ హాట్ బ్యూటీ.ఇక అనసూయ శశాంక్ భరద్వాజ్( Shashank Bhardwaj ) ను పెళ్లి చేసుకోగా ఈమెకు ఇద్దరు కొడుకులు ఉన్నారు.అయినా కూడా తన అందంతో ఎటువంటి మార్పు లేదు.
లేటు వయసులో కూడా తన అందాలను ఆరబోస్తుంది.ఇక సోషల్ మీడియాలో వాటిని పంచుకుంటూ బాగా సందడి చేస్తుంది.
నిత్యం ఫోటో షూట్లతో బాగా హడావుడి చేస్తుంది.అప్పుడప్పుడు అభిమానులతో ముచ్చట్లు కూడా పెడుతూ ఉంటుంది ఈ హాట్ బ్యూటీ.
ఇక ఈమెకు నెగటివ్ కామెంట్స్ వస్తే చాలు ఓ రేంజ్ లో ఫైర్ అవుతుంది.వెంటనే లైవ్ లోని వారిపై ప్రతి కారం తీర్చుకుంటుంది.
అయితే ఇదంతా పక్కనే పెడితే తాజాగా తను ఒక వీడియో పంచుకుంది.అందులో తను విదేశాలలో చాలా ఎంజాయ్ చేసినట్లు కనిపించింది.అయితే ఆ వీడియో పంచుకోగా తన అభిమానులు లైక్స్ కొట్టగా మరి కొంతమంది ఎప్పటిలాగే ట్రోల్ చేయటం మొదలు పెట్టారు.ఇక ఓ నెటిజన్.జాగ్రత్తగా ఉండు.నీ పేరు, నీ భర్త పేరు డ్రగ్స్ వ్యవహారంలో ఎప్పుడో బయటపడతాయి.
ఇప్పుడు చాలా ఎంజాయ్ గా, లగ్జరీగా గడుపుతున్నావు.ఒకవేళ అది బయటపడితే ఇదంతా కింద పడిపోయి బ్యాడ్ సిట్యుయేషన్ వస్తుందని హెచ్చరించినట్లు కనిపించారు.
దీంతో దీనికి సపోర్టుగా మరో నెటిజన్.వాడు పక్కా డీలర్ లానే ఉంటాడు మామ అంటూ అనసూయ భర్తను ఉద్దేశించి కామెంట్ పెట్టినట్లు అర్థమవుతుంది.
రీసెంట్గా డ్రగ్స్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం నెటిజన్స్ చేసిన కామెంట్లు బాగా వైరల్ అవుతున్నాయి.
దీని గురించి అనసూయ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.