యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘సలార్(Salaar )’ చిత్రానికి సంబంధించిన టీజర్ నేడు ఉదయం తెల్లవారు జామున 5 గంటల 14 నిమిషాలకు విడుదలై డివైడ్ టాక్ ని రప్పించుకున్న సంగతి అందటికీ తెలిసిందే.ఈ చిత్రం ప్రారంభం రోజు నుండే అభిమానుల్లో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఎందుకంటే ప్రశాంత్ నీల్( Prashanth Neel ) ఎలివేషన్స్ లో ప్రభాస్ లాంటి భారీ కటౌట్ కనిపిస్తే చూడాలని కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు ఆడియన్స్ కూడా ఎంతగానో కోరుకున్నారు.అలా కొట్టుకుంటున్న సమయం లో వచ్చిన ఈ సినిమా ప్రకటన, అభిమానులను సంబరాల్లో మునిగిపోయేలా చేసింది.
అలా రోజు రోజు అంచనాలు పెంచుకుంటూ పోయిన సినిమా కాబట్టి, ఆ చిత్రానికి సంబంధించిన టీజర్ కోసం అభిమానులు అంతలా ఎదురు చూడడం లో ఆశ్చర్యం లేదు.అయితే అంతటి భారీ అంచనాలే ఈ సినిమా టీజర్ కి డివైడ్ రెస్పాన్స్ రావడానికి కారణం అని అంటున్నారు.
అలాంటి టీజర్ లో ప్రభాస్ ఫేస్ ని చూపించకపోతే అభిమానులు తట్టుకోలేరు కదా, ఈ టీజర్ విషయం లో కూడా అదే జరిగింది.సమయం కానీ సమయం లో ఉదయం 5 గంటల 14 నిమిషాలకు టీజర్ అని చెప్పడం తో అభిమానులు రాత్రి మొత్తం జాగారం చేసారు.ఇక మరో పక్క ఆడియన్స్ ఈ టీజర్ ని చూసేందుకు అలారామ్స్ పెట్టుకొని మరీ లేచారు.కానీ తీరా చూసిన తర్వాత ప్రభాస్ పాత్రకి ఎలివేషన్స్ అయితే ఉన్నాయి కానీ, ఆ షాట్స్ కి సంబంధించి క్లోజ్ అప్ షాట్స్ ని దాచిపెట్టడం ఏందో.
అయితే అలా దాచిపెట్టడానికి బలమైన కారణం ఉందని అంటున్నారు కొంతమంది విశ్లేషకులు.అసలు విషయానికి వస్తే ఈ సినిమాకి సంబంధించిన కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్ ఇంకా బోలెడంత బ్యాలన్స్ ఉందట.
ముఖ్యంగా ప్రభాస్ ముఖానికి సంబంధించి కూడా కొన్ని VFX షాట్స్ బ్యాలన్స్ ఉండడం తో టీజర్ లో ఆయన క్లోజ్ అప్ షాట్స్ లేవని అంటున్నారు.
అయ్యినప్పటికీ కూడా ప్రభాస్ బాడీ షాట్స్ ని చూపిస్తూ చివర్లో ఆయన పిడికిలి బిగించినట్టుగా చూపించి, డిఫరెంట్ టేకింగ్ తో ఒక రకమైన ఎలివేషన్ సన్నివేశం అన్నట్టుగా ఆడియన్స్ లో ఒక ఫీలింగ్ కలిగించేలా చేసాడు డైరెక్టర్.ఇది మేకింగ్ స్కిల్స్ కి నిదర్శనం అని అంటున్నారు విశ్లేషకులు.ఇక పోతే ఈ టీజర్ కి ఇప్పటి వరకు 35 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి.
ఇక లైక్స్ వైషయానికి వస్తే ఏకంగా 13 లక్షల లైక్స్ వచ్చాయి.ఇది టాలీవుడ్( Tollywood ), లోనే ఆల్ టైం రికార్డు గా చెప్తున్నారు ఫ్యాన్స్.
ఇదే స్పీడ్ తో ముందుకు దూసుకుపోతే కచ్చితంగా 24 గంటల్లో 80 మిలియన్ కి పైగా వ్యూస్ వస్తాయని అంటున్నారు.చూడాలి మరి ఈ టీజర్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో అనేది.
.