మమత ఆసుపత్రిలో పేదలకు అతి తక్కువ ధరలకే అత్యంత నాణ్యమైన, అధునాతన వైద్య సేవలు అందిస్తూన్నమని మమత వైద్య విద్యా సంస్థల సెక్రటరీ జయశ్రీ పువ్వాడ వెల్లడించారు.మానవ దేహం నిర్మాణంలో అత్యంత సున్నితమైనది, అతి ముఖ్యమైనది వెన్నుపూస(Spinal Cord) అని దాని చికిత్సలు నిర్వహించడం వైద్య రంగంలో క్లిష్టమైనది అని, అలాంటి చికిత్సలు అతి తక్కువ ఖర్చులతో మమత ఆసుపత్రిలో చేస్తున్నామని అన్నారు.
మమత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఇటీవలే 10 రోజుల వ్యవధిలో నిర్వహించిన 7 శస్త్ర చికిత్సలు విజయవంతం చేశామని, వైద్య రంగంలో అత్యంత ప్రమాదకరమైన వివిధ రకాల ట్రామా, బ్రెయిన్ ట్యూమర్, స్పైన్ ట్యూమర్, కాళ్ళు చేతులు చచ్చు పడిపోవడం లాంటి అత్యంత క్లిష్టమైన శాస్త్ర చికిత్సలను నిర్వహించి వారిని పూర్తి ఆరోగ్య వంతులుగా చేశామన్నారు.
మమత వైద్య విద్యా సంస్థల చైర్మన్ పువ్వాడ అజయ్ కుమార్ గారు, ఫౌండర్ చైర్మన్ పువ్వాడ నాగేశ్వర రావు గారి పర్యవేక్షణలో పేదలకు అధునతనమైన వైద్యంను అందించేందుకే మమత ఆసుపత్రిలో అనేక సేవలు అందిస్తున్నామని, అనేక ప్రాంతాలలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నమన్నరు.
మమత ఆసుపత్రిలో ఉచిత వైద్య సేవలు, ఉచిత భోజనంతో పాటు అతి తక్కువ చార్జీలతో సూపర్ స్పెషాలిటీలో హైదరబాద్, విజయవాడ, మద్రాస్ తరహాలో అధునాతన వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు.ఆయా శాస్త్ర చికిత్సలు విజయవంతం చేసిన Dr.జగదీష్ టీమ్ ను వారు అభినందించారు.
నూరో సర్జన్ Dr.జగదీష్ బాబు మాట్లాడుతూ.ఇలాంటి అనేక క్లిష్ట సర్జరీ లు చేపట్టి వియవంతం చేశామని అందుకు తగ్గ ఎక్విప్మెంట్ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచినందుకు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.
సూర్యాపేట జిల్లా గోవిందాపురం గ్రామంకు చెందిన గోపయ్యా, స్పైనల్ కార్డ్ ట్యూమర్ తో బాధపడుతున్న ఆశ్వరావుపేటలోని జమ్మిగుడెం కు చెందిన వెంకమ్మ, skull బోన్ ఫ్రాక్చర్(Head injury)తో మమతలో చేరిన మహబూబాాద్ జిల్లా పెద్ద గూడూరు కు చెందిన శ్రీకాంత్ కు చికిత్స చేసి విజయవంతం గా చేశామన్నారు.కోమా స్థితిలో ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి కి చెందిన రాహేలు కు శాస్త్ర చికిత్స అనంతరం పూర్తిగా కోలుకున్నాడని వివరించారు.
కాళ్ళు, చేతులు చచ్చుబడిన స్థితిలో ఆసుపత్రిలో చేరిన ఖమ్మం రమణగుట్టకు చెందిన M.హనుమంత్, తిరుమలాయిపాలెం కు చెందిన రాజు నేడు పూర్తిగా కోలుకున్నారని పేర్కొన్నారు.ప్రమాదకర స్థితిలో ఉన్న మెదడు, వెన్నుపూసలో ఉన్న భారీ పరిమాణంలో ఉన్న కణితి లను తొలగించామని ఇలాంటి శాస్త్ర చికిత్సలు నిర్వహించడం ఇదే ప్రథమం అన్నారు.ఎక్కడ చిన్న తేడా వచ్చినా ప్రాణానికే ప్రమాదం వాటిల్లే పరిస్థితిలో అత్యధిక పరికరాలు ఉండటం వల్ల చాలా అద్యాయనం చేసి, చాలా పరీక్షలు, చాలా స్టడీ చేసి మా టీమ్ సహాయంతో చాలా సున్నితమైన శాస్త్ర చికిత్సలను విజయవంతం చేశామని పేర్కొన్నారు.
మమ్మల్ని ప్రోత్సహించి, మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన సంస్థ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు.సమావేశంలో సూపరింటెండెంట్ రామ స్వామి, డీన్ అండ్ ప్రిన్సిపల్ అనిల్ కుమార్, తదితరులు.