శాండ్ విచ్ వల్ల మోడల్ కు రూ.1.43 లక్షల ఫైన్.. ఎందుకో తెలుసా?

శాండ్ విచ్ వల్ల ఓ మోడల్ రూ.1.43 లక్షల ఫైన్ కట్టాల్సి ఉంది.శాండ్ విచ్ వల్ల జరిమానా కట్టాల్సి రావడం ఏంటని అనుకుంటున్నారా? అవును మీరు విన్నది అక్షరాలా నిజమే.శాండ్ విచ్ వల్ల ఆ మోడల్ కి పెద్ద నష్టమే తెచ్చిపెట్టింది.ఏకంగా లక్షకుపైగా జరిమానా కట్టాల్సి వచ్చింది.విమానంలో శాండ్ విచ్ తెచ్చుకున్నందుకు గాను కస్టమ్స్ అధికారులు ఆస్ట్రేలియాకు చెందిన మోడల్ జెస్సికా లీకి ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అధికారులు జరిమానా విధించారు.ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా విమానంలో శాండ్ విచ్ తెచ్చుకున్నందుకు గాను ఫైన్ విధించారు.

 The Model Was Fined Rs 1.43 Lakh Due To Sandwich Do You Know Why , Sandwich, Fi-TeluguStop.com

ఆస్ట్రేలియాకు చెందిన మోడల్ జెస్సికా లీ యూరప్ నుంచి ఆస్ట్రేలియాకు విమానంలో ప్రయాణిస్తోంది.దాదాపు 11 గంటల ప్రయాణం చేయాల్సి వస్తోంది.విమానంలో బాగా ఆకలి వేస్తోంది.అయితే సింగపూర్ లో విమానం ఛేంజ్ అవ్వాల్సి ఉంటుంది.

సింగపూర్ లో విమానం ఛేంజ్ అయ్యే సమయంలో అక్కడ ఎయిర్ పోర్ట్ లోని సబ్ వేలో శాండ్ విచ్ కొనుగోలు చేసింది.ఆ శాండ్ విచ్ ఒక ఫీట్ పొడవు ఉంటుంది.

హాఫ్ శాండ్ విచ్ ను ఎయిర్ పోర్ట్ లో తినేసింది.మిగతా సగం శాండ్ విచ్ ను విమానంలో తినవచ్చు అనుకోని బ్యాగ్ లో పెట్టుకుని విమానం ఎక్కింది.

అయితే ఆదే ఆమెకు తంటాలు తెచ్చి పెట్టింది.

విమానంలో ఆ శాండ్ విచ్ ను తినడం మానేసింది.

చివరికి ఆస్ట్రేలియాలోని ఎయిర్ పోర్ట్ లో విమానం దిగింది.ఈ సందర్భంగా కస్టమ్ అధికారులు తనిఖీలు చేయగా.

మిగిలిన శాండ్ విచ్ కనిపించింది.దీంతో ముందుగా సమాచారం ఇవ్వకుండా శాండ్ విచ్ తెచ్చుకున్నందుకు కస్టమ్ అధికారులు ఆమెకు రూ.1.43 లక్షల జరిమానా విధించారు.

Telugu Lakhs, Fine, Jessica Lee, Sandwich, Latest-Latest News - Telugu

విమానంలో ప్రయాణించేటప్పుడు ఎయిర్ పోర్ట్ లో మనం తీసుకెళ్లే ప్రతి వస్తువుకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది.అయితే జెస్సికా లీ శాండ్ విచ్ కు సంబంధించిన సమాచారాన్ని ముందుగా తెలపనందుకు అధికారులు ఫైన్ విధించారు.ఈ విషయాన్ని జెస్సికా లీ సోషల్ మీడియాలో తెలిపింది.

దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది.ఎవరూ ఇలా చేయవద్దని సూచించింది.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube