డబుల్ డెక్కర్ బస్ ను తరగతిగా మార్చేసిన అక్కడ ప్రభుత్వం.!

పిల్లల చదువు కోసం ప్రభుత్వాలు అనేక రకాల చర్యలు తీసుకుంటున్నాయి.రకరకాల పధకాలు ప్రవేశపెడుతూ పిల్లలను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు.

 Kerala State Transport Minister Anthony Raju, Double Dekkar, Bus, Double Decker-TeluguStop.com

ఈ క్రమంలోనే కేరళ ప్రభుత్వం ఒక సరికొత్త ఆలోచన చేసింది.విద్యార్థులకు పాఠశాలలో చదువులు చెప్పడం గురించి మనం వినే ఉంటాము.

కానీ వినూత్నంగా కేరళ ప్రభుత్వం ఒక డబుల్​ డెక్కర్​ బస్సులో పిల్లలకు పాఠాలు చెబుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.బస్సులో పాఠాలు వినడం అనేది విద్యార్థులకు ఒక సరికొత్త అనుభూతిగా మారిందనే చెప్పాలి.

కేరళ రోడ్డు రవాణాసంస్థకు చెందిన ఓ డబుల్‌ డెక్కర్‌ బస్సు ను ప్రభుత్వ పూర్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఆటపాటల ఆడుకునెందుకు, పాఠాలు వినెందుకు అనువుగా మార్చారు.

కేరళ రోడ్డు రవాణా సంస్థ తుక్కుగా భావించి పక్కన పెట్టిన బస్సుల్లోంచి ఒక డబుల్ డెక్కర్ బస్సును రెండంచెల తరగతి గదిగా మార్పులు చేసారు.

బస్సులోని పైభాగాన్ని పిల్లలు చదువుకోవడానికి అనుకూలంగా, అలాగే కింద బాగాన్ని ఆటలకు అనువుగా తీర్చిదిద్దారు.ఈ బస్సును స్కూలుకు విరాళంగా ఇవ్వడం జరిగింది.ఈ బస్సును మానక్కాడ్‌ లోని ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ సంస్థ ఆవరణలో పెట్టి పిల్లలకు పాఠాలు చెబుతున్నారు.అలాగే ఈ బస్సులో టీవీ, ఏసీ, కుర్చీలు, కొన్ని రకాల బల్లలు, బెంచీలు, పుస్తకాల, అలమరాలు అమర్చడం జరిగింది.

మరో విశేషం ఏంటంటే.ఈ బస్సును పిల్లలు తామే స్వయంగా నడుపుతున్న భావన కలిగించేలాగా బస్సులోనూ స్టీరింగ్‌ చక్రం, డ్రైవరు సీటు అలాగే ఉంచేశారు.అంతేకాకుండా బస్సుకు రెండు వైపులా పక్షులు, జంతువులు, చెట్ల బొమ్మలు, కార్టున్స్ బొమ్మలను చిత్రించారు.కేరళ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి ఆంటోనీ రాజు ప్రభుత్వ పాఠశాలకు మరో రెండు బస్సులను ఇచ్చేందుకు మే 17న ఆమోదం తెలిపారు.

ఈ బస్సులో పాఠాలు వినడం పిల్లలకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుందనే చెప్పాలి.తరగతి గదిని పోలిన ఈ డబుల్ డెక్కర్ బస్సు ఆలోచన అనేది భలే ఉందని అందరూ మెచ్చుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube