ప్రతి ఒక్కరి జీవితంలో అక అద్భుతమైన ఘట్టం, ఒక ప్రత్యేకమైన రోజు, వందేండ్ల పాటు బంధాన్ని ముడి పడేస్తుంది.అదే పెండ్లి, మ్యారేజ్, షాదీ, ఏ భాషలో చెప్పుకున్నా ఒక ప్రత్యేకతను సంతరించు కుంటుంది.
అందుకే పెండ్లంటే నూరేళ్ల పంట అంటారు.అందుకే చాలామంది పెండ్లిని అత్యంత వైభవంగా జరుపుకోవాలని అనుకుంటుంటారు.
బంధువులు, సన్నిహితులు, స్నేహితులు ఇలా… అందరి నడుమ సంతోషంగా అట్టహాసంగా పెండ్లి చేసుకోవాలని నిర్ణయించు కుంటారు.పెండ్లికి సంబంధించిన ప్రతి విషయంను ఇతరులతో షేర్ కూడా చేసుకుంటారు.
ఫొటోలు, వీడియోలు, సెల్పీలు… ఇలా అన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు.ఇలాంటివి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
కొన్ని సంఘటనలు నవ్వులు పూయిస్తే.మరికొన్నిజాలి చూపించేలా అయ్యోపాపం అనేలా ఉంటాయి.
కొన్నిసందర్భాల్లో అనుకోకుండా జరిగిన ఘటనల వీడియోలు చూస్తే పొట్ట చెక్కలవ్వాల్సిందే.ఇలాంటిదే ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో అబ్బాయిని నూతన వధువు కంటిచూపుతో భయపెట్టేసింది.అసలు ఎందుకు భయపెట్టిందనుకుంటున్నారా…? మమూలుగా అయితే దుస్తుల విషయంలోనైనా… నగల విషయంలోనైనా ? లేదంటే వారి బంధువులకు ఏదైనా అసౌకర్యం కల్పించేలా చేసినా కోపం వస్తుంటుంది.ఇది సాధారణం.కానీ, కంటి చూపుతోనే పెండ్లిలో భయపెట్టడం మనం చూసి ఉండం.కానీ ఈ వీడియోలో ఓ నవ వధువు అబ్బాయిని కంటిచూపుతో భయపెట్టింది.అందుకే వీడయో వైరల్ అయింది.
అసలేం జరిగిందంటే… ఆ వీడియోలో పెండ్లి అనంతరం నూతన వధూవరులు ఇద్దరు బంధు మిత్రులతో కలిసి విందు భోజనం ఆరగిస్తున్నారు.అయితే భోజనం చేసే సమయంలో వధువు విస్తరాకులోని వడను వరుడు తీసుకునేందుకు యత్నించాడు.
అది కాస్త చూసిన వధువు కోపంగా కంటి చూపు విసిరింది.ఇంకేముంది వరుడు హడలిపోయి వడను ఆమె విస్తరిలోనే వదిలేసి బుద్ధిగా భోజనం చేశాడు.
ఆవెంటనే వధువు నవ్వేయడంతో వరుడు ఖుషీ అయ్యాడు.దీనిని చూసిన నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.