ఆర్థిక మాంద్యం భయమే ఇంకా పోలేదు, ఇపుడు ఏఐ వంతా... 30 కోట్ల ఉద్యోగాలు గోవిందా?

అవును, ఆర్థిక మాంద్యం దెబ్బతో ఇప్పటికే పెద్ద పెద్ద ఐటీ సంస్థలు( IT organizations ) అడ్డగోలుగా ఉద్యోగాలను విధులలోంచి తొలగించారు.ఇక వున్న కొద్ది మంది ఉద్యోగుల జీతాలతో కూడా కోత విధిస్తున్నాయి.

 The Fear Of Economic Recession Is Still Not Gone, Now Ai Is All 30 Crore Jobs La-TeluguStop.com

గూగుల్( Google ) అయితే కొత్త ప్రాజెక్టుల జోలికే పోవడం లేదు.అమెజాన్ అనుబంధ వ్యాపారాలు మొత్తం క్లోజ్ చేసే పనిలో పడింది.

ఇక ఆపిల్( Apple ) అయితే ఇప్పట్లో కొత్త యూనిట్లను ప్రారంభించే యోచన లేదని తెగేసి చెబుతోంది.ఇటువంటి తరుణంలో కృత్రిమ మేథ పలు కంపెనీల వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

ఇక ఉద్యోగుల మాటైతే ఇక చెప్పేదేముంది.అది మన ఊహకే వదిలేస్తున్నారు.

నేడు ఇంటర్నెట్ ప్రపంచంలో ‘ఉత్పాదక కృత్రిమ మేధ( Generative artificial intelligence )’ (జనరేటివ్‌ ఏఐ) పేరు బాగా వినబడుతోంది.ఇక దీని దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా 30 కోట్ల ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని.అంతర్జాతీయ పెట్టుబడుల సంస్థ గోల్డ్‌మన్‌ శాక్స్‌ తాజా నివేదికలో జోశ్యం చెప్పింది.అయితే ఇందులో నిజాలు లేకపోలేదు అని చెబుతున్నారు టెక్ నిపుణులు.మరీ ముఖ్యంగా ఆటోమేషన్‌తో ఎక్కువ పనులు అయిపోయే రంగాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది.ప్రస్తుతం అమెరికా, యూరప్‌ దేశాల్లోని ఉద్యోగాల్లో మూడింట రెండొంతుల మేర ఉద్యోగాలను ఎంతో కొంత ఆటోమేషన్‌ ద్వారా చేయించుకోవచ్చని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.

అయితే శారీరక శ్రమ అవసరమయ్యే ఉద్యోగాలపై మాత్రం ఏఐ ప్రభావం అస్సలు ఉండదు.ఆఫీసు నిర్వహణ సంబంధిత ఉద్యోగాలు ఆటోమేట్‌ అయ్యే అవకాశం 46 శాతం ఉందని, ఆ ఉద్యోగాలన్నింటినీ తప్పకుండా ఏఐ ఆక్రమిస్తుందని చెబుతున్నారు.న్యాయవ్యవస్థకు సంబంధించిన ఉద్యోగాల్లో 44%, ఆర్కిటెక్చర్‌ ఉద్యోగాల్లో 37% ఉద్యోగాలకు ఏఐ ముప్పు పొంచి ఉందని పేర్కొంది.ఉత్పాదక కృత్రిమ మేధకు ఇపుడు చక్కని ఉదాహరణ.చాట్‌ జీపీటీ( Chat GPT ).తనవద్ద ఉన్న నిర్దిష్టమైన డేటా ఆధారంగా.కొత్తగా టెక్స్ట్‌, చిత్రాలు, వీడియోలు, త్రీడీ మోడళ్లను సృష్టించగలిగే కృత్రిమ మేధ ఇది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube