కుక్క ముఖం ఏంటి ఇలా మారిపోయింది.. ఫన్నీ వీడియో వైరల్..!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని వీడియోలు భలే ఫన్నీగా ఉంటాయి.వీటిలో కొన్ని చూస్తే మన కళ్లను మనమే నమ్మలేం.

 The Dog's Face Changed Dog, Face, Changed, Viral Latest, News Viral, Social Med-TeluguStop.com

ఎందుకంటే అవి వాస్తవ ప్రపంచంలో కనిపించే వాటికి చాలా భిన్నంగా ఉంటాయి.తాజాగా ఈ కోవకు చెందిన ఒక వీడియో వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో ఒక యువతి తన కుక్కపై టిక్‌టాక్ ఫిల్టర్ యూజ్‌ చేసింది.దీంతో ఆ కుక్క ముఖం విచిత్రంగా మారిపోయింది.

కార్టూన్ ఫేస్ లాగా ఈ కుక్క ముఖం చేంజ్ కావడంతో యజమాని బాగా నవ్వుతూ ఎంజాయ్ చేసింది.నిశితంగా పరిశీలిస్తే ఈ కుక్క ముఖం కాస్త ఒక అమ్మాయి లాగా కూడా కనిపించింది.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువతి యోగా మ్యాట్ పై పడుకోవడం చూడొచ్చు.ఆమెకి కాస్త దూరంలో పచ్చిక గడ్డిపై ఒక తెల్ల కుక్క పడుకుంది.

అప్పటికే టిక్‌టాక్ ఫిల్టర్ ఆన్ చేసిన ఆ యువతి కుక్క వైపు తన ఫోన్ కెమెరా ని తిప్పింది.అంతే, క్షణాల్లోనే ఆ కుక్క ఫోన్‌లో చాలా విచిత్రంగా కనిపించింది.

ఇది చూసి ఆ యజమాని నవ్వాపుకోలేక పోయింది.దీన్ని చూసిన నెటిజన్లు కూడా కడుపుబ్బ నవ్వుకుంటున్నారు.

ఇది చాలా భయానకంగా ఉందని ఒక యూజర్ కామెంట్ పెట్టారు.ఈ వీడియో చూస్తే నవ్వాపుకోలేకపోతున్నా అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.“ఈ ఫిల్టర్ భలే ఫన్నీగా ఉంది, కుక్కపై కూడా ఈ ఫిల్టర్ పనిచేయడం భలే ఆశ్చర్యంగా అనిపిస్తోంది” అని ఒక నెటిజన్ పేర్కొన్నారు.ఈ హిలేరియస్ వీడియోని @Doggosdoingthings అనే ఇన్‌స్టాగ్రామ్ వీడియో షేర్ చేసింది.

ఈ వీడియోకి మిలియన్ల కొద్దీ వ్యూస్, 2 లక్షల వరకు లైకులు వచ్చాయి.ఈ ఫన్నీ వీడియో ని మీరు కూడా తిలకించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube